Vishwambhara Music: కీరవాణి కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చేశారు.. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఇది!
Vishwambhara Music Director: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర (Vishwambhara)సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కించుకున్న హనుమాన్ ఫేమ్ గౌర హరి.
- V Santhosh Kumar
- Updated on- May 2, 2026 / 05:53 PM IST
HanuMan movie fame Gowra Hari composing music for chiranjeevi Vishwambhara movie
- భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర
- బీజీఎమ్ అందిస్తున్న గౌరా హరి
- సాంగ్స్ అందిస్తున్న కీరవాణి.
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర(Vishwambhara)’ చిత్రం టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సోషియో-ఫాంటసీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తుండగా, కథలో దైవిక అంశాలతో పాటు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను సరికొత్త లోకానికి తీసుకెళ్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి కెరీర్‌లో ‘అంజి’ తర్వాత వస్తున్న భారీ ఫాంటసీ చిత్రం కావడం వల్ల దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అయితే, దాదాపు రెండేళ్ల క్రితమే షూటిం స్టార్ట్ అయిన ఈ సినిమా విడుదల మాత్రం కావడం లేదు. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేందుకు టీం కష్టపడుతున్నారు. ఆ కారణంగానే వాయిదా పడుతూ వస్తోంది ఈ సినిమా. ఈ నేపధ్యంలోనే తాజాగా విశ్వంభర సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతోంది. ఈ సినిమాకు నేపథ్య సంగీతం (RR) కోసం గౌరా హరిని తీసుకున్నారట మేకర్స్. హనుమాన్, మిరాయ్ సినిమాలకు తన అద్భుతమైన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు గౌర హరి.
అందుకే, ఇప్పుడు ఈ సినిమాకు గౌర హరిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారట మేకర్స్. కీరవాణి కొంతకాలంగా రాజమౌళి సినిమాతో బిజీగా ఉంటూ వస్తున్నాడు. అందుకే, చిరు సినిమాను పక్కనపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే, ఆయన విశ్వంభర కోసం అద్భుతమైన పాటలను కంపోజ్ చేయగా కేవలం ఆర్ఆర్ కోసం గౌర హరిని తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే రీ రికార్డింగ్ కూడా కంప్లీట్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకుకే తీసుకురావాలని చూస్తున్నారట మేకర్స్. త్వరలోనే రిలీజ్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
