Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో అభిమానులు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణి, మణికర్ణికా లాంటి హిస్టారికల్ సినిమాల తర్వాత క్రిష్ చేపట్టిన క్రేజీ ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగానే ఈ సినిమాకు పనిచేసిన స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా సెన్సేషనల్ కామెంట్ చేశారు. హరిహర వీరమల్లు సినిమా స్టోరీ.. నెక్స్ట్ లెవెల్ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. హరిహర వీరమల్లు ఎక్కడా తగ్గే ప్రసక్తి లేకుండా స్టోరీ స్క్రీన్ ప్లే ఉందని ఈ స్టార్ రైటర్ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.
పవన్ కళ్యాణ్‌ను ఇప్పటి వరకు ప్రేక్షకులు ట్రెండీ లుక్‌లోనే చూడగా.. ‘కాటమరాయుడు’లో పంచెకట్టులో చూశారు. కానీ, హరిహర వీరమల్లులో హిస్టారికల్ హీరోగా, బందిపోటుగా చూడబోతున్నారు. ఆయన లుక్‌ను పూర్తిగా కొత్తగా మార్చేశారు డైరెక్టర్ క్రిష్. దీంతో పవన్ అభిమానులకు ఇది ఖచ్చితంగా స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇందులో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీరవాణి బాణీలు అందిస్తున్నారు.
పవన్ కెరీర్ లో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న తొలి సినిమా ఇదే కాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్‌తో ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండడంతో మరింత అంచనాలున్నాయి.