Krishnashtami : ఈ క్యూట్ కృష్ణ, గోపికలు ఎవరో తెలుసా? 16 కోట్ల సినిమాతో 400 కోట్లు కలెక్ట్ చేసిన స్టార్ హీరో పిల్లలు..

పలువురు సెలబ్రిటీలు తమ చిన్ని కృష్ణుడు, గోపికల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.

Krishnashtami : ఈ క్యూట్ కృష్ణ, గోపికలు ఎవరో తెలుసా? 16 కోట్ల సినిమాతో 400 కోట్లు కలెక్ట్ చేసిన స్టార్ హీరో పిల్లలు..

Krishnashtami Special

Updated On : August 17, 2025 / 7:55 AM IST

Krishnashtami : నిన్న కృష్ణాష్టమి సందర్భంగా పలువురు తమ పిల్లలను చిన్ని కృష్ణుడిగా, గోపికగా తయారుచేసి ఫొటోలు తీసుకుంటారని తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలు కూడా తమ పిల్లలను అలాగే తయారుచేసి ఫొటోలు తీయించారు. పలువురు సెలబ్రిటీలు తమ చిన్ని కృష్ణుడు, గోపికల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.

Krishnashtami

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న కృష్ణుడు, గోపిక స్టార్ హీరో పిల్లలు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే కన్నడ స్టార్ హీరో, కాంతార సినిమాతో భారీ విజయం సాధించిన రిషబ్ శెట్టి పిల్లలు. కేవలం 16 కోట్లతో కాంతార సినిమా చేసి 400 కోట్లు కలెక్ట్ చేసి ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ తీస్తున్నాడు.

Krishnashtami

Also Read : Pranitha Subhash : కృష్ణాష్టమి స్పెషల్.. కొడుకుని చిన్ని కృష్ణుడిగా చేసిన హీరోయిన్.. ఫొటోలు..

రిషబ్ శెట్టి రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. ప్రతి పండక్కి తన భార్య పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తాడు. తాజాగా నిన్న కృష్ణాష్టమి కావడంతో తన కొడుకు రన్విత్ శెట్టిని ఇలా చిన్ని కృష్ణుడిగా తయారుచేసారు. కూతురు రాధ్య శెట్టిని గోపికలా తయారుచేసారు. తన పిల్లల్ని క్యూట్ గా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రిషబ్ ఫ్యాన్స్ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.

 

Also Read : Anchor Sravanthi : కృష్ణాష్టమి స్పెషల్.. నెత్తిన నెమలి పించం పెట్టుకొని.. గోపికలా మారిన యాంకర్ స్రవంతి.. ఫొటోలు..