Ustaad Bhagat Singh: 3 లక్షల 60 వేల ట్వీట్స్.. ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. చెప్పినా నమ్మడం లేదు కదా
ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) రీమేక్ అంటూ జరుగుతున్న ట్రోలింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్.
- V Santhosh Kumar
- Published On : March 13, 2026 / 09:56 AM IST
Harish Shankar interesting comments about trolling on Ustaad Bhagat Singh
- ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదు
- క్లారిటీ ఇచ్చేసిన హరీష్ శంకర్
- ట్రోలింగ్ పై అసహనం వ్యక్తం చేసిన దర్శకుడు
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు హరీష్ శంకర్.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా విజయ్ నటించిన ‘తేరి’ చిత్రానికి రీమేక్ అంటూ వస్తున్న వార్తలు, నెటిజన్ల ట్రోలింగ్ చేస్తున్నారు. కేవలం ట్రోల్ చేయడానికే సుమారు మూడు లక్షల అరవై వేల ట్వీట్లు వేశారు. సినిమా గురించి వాస్తవాలు చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏ సినిమాకు రీమేక్ కాదు. ఇది పూర్తిగా ఒరిజినల్ కథ.
Tamannaah: రవితేజ ‘ఇరుముడి’ మూవీతో తమన్నా రీఎంట్రీ.. ఈ స్పెషల్ రోల్ సినిమాకే హైలెట్
నేను చెబుతున్నా కూడా నమ్మకపోతే ఎలా? ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి చెప్పాలా?” రేపు సినిమా విడుదలయ్యాక థియేటర్లలో చూసినప్పుడు అది రీమేక్ కాదని అందరికీ అర్థమవుతుంది. అప్పటి వరకు వేచి ఉండండి’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఇంకా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథను సిద్ధం చేశానని, ఇందులో కేవలం వినోదమే కాకుండా సామాజిక అంశాలు కూడా ఉంటాయని వివరించారు.
దీంతో, హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక, గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేయగా, త్వరలోనే ట్రైలర్ కూడా రానుంది. మరి మార్చి 19న భారీ అంచనాల మధ్య రానున్న ఈ సినిమా ఎలాంటి సంచనాలను క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
