Oxygen Distribution: చాలా సినిమాల్లో హీరో.. ఆక్సిజన్ కోసం బైక్ అమ్మకానికి..
తకిట తకిట, నా ఇష్టం, కవచం వంటి పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్‌లోనూ సనమ్ తేరీ కసమ్ వంటి అడపాదడపా చిత్రాల్లో ...
- Subhan Ali Shaik
- Updated on- May 2, 2021 / 11:49 AM IST
Oxygen Distribution
Oxygen Distribution: కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ భయానక పరిస్థితులను చూపిస్తుంది. ఆక్సిజన్ సంక్షోభం ఏర్పడటంతో ఇండియా వ్యాప్తంగా నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితులని గమనించిన పలువురు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ఫిదా ఫేం హర్షవర్ధన్ రాణే తన బైక్‌ని అమ్మి మరీ ఆక్సిజన్ అందిస్తానంటున్నాడు.
తన బైక్‌ను తీసుకొని ఆక్సిజన్‌ను ఇవ్వండని, అవసరమైన పేషెంట్లకు దాన్ని అందిస్తానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఎంతో ప్రేమగా చూసుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను తనే స్వయంగా శుభ్రం చేస్తున్న ఫొటోలతో పాటు దానిపై చక్కర్లు కొట్టిన ఫొటోలను సైతం షేర్ చేశాడు.
ఈ నటుడు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకున్న జనాలు అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కష్టకాలంలో మీరు చూపిస్తున్న చొరవ అద్భుతం అని కామెంట్స్ పెడుతున్నారు. గతేడాది అక్టోబర్‌లో కరోనాని జయించాడు హర్ష.
ఇదిలా వుంటే వరుణ్‌తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమాలో హర్షవర్ధన్ ఓ ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు తకిట తకిట, నా ఇష్టం, కవచం వంటి పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్‌లోనూ సనమ్ తేరీ కసమ్ వంటి అడపాదడపా చిత్రాల్లో నటించాడు. ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో రిలీజైన తైష్ సినిమాలోనూ కనిపించాడు.
