Harshavardhan Rameshwar: అవన్నీ ఫేక్.. నేను హైదరాబాద్ వస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్

ఆదర్శ కుటుంబం సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం త్వరలో హైదరాబాద్ వస్తున్నట్టు క్లారిటీ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్(Harshavardhan Rameshwar).

Harshavardhan Rameshwar Clarifies Change in Music Director for Adarsha Kutumbam movie

  • ఆదర్శ కుటుంబం నుంచి నేను తప్పుకోలేదు
  • Ak47 కోసం హైదరాబాద్ వస్తున్నా
  • క్లారిటీ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్

Harshavardhan Rameshwar: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ నుండి సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకున్నారని, ఆయన స్థానంలోకి త్రివిక్రమ్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చారనే ప్రచారం జోరుగా సాగింది.

Karuna Bhushan: స్లీవ్‌లెస్ టాప్‌లో సీరియల్ బ్యూటీ.. కరుణ భూషణ్ గ్లామర్ షో నెక్స్ట్ లెవల్.. ఫొటోలు

అయితే ఈ న్యూస్ కి చెక్ పెడుతూ స్వయంగా హర్షవర్ధన్ రామేశ్వర్(Harshavardhan Rameshwar) క్లారిటీ ఇచ్చాడు. తాను ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం తాను చెన్నైలో ఉన్నానని, సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం మే 1వ తేదీన హైదరాబాద్ రానున్నట్టు వెల్లడించారు. ఈ వివరణతో గత కొన్ని రోజులుగా సాగుతున్న అవాస్తవ ప్రచారానికి తెరపడింది. త్రివిక్రమ్ మార్క్ మేకింగ్‌కు హర్షవర్ధన్ అదిరిపోయే బాణీలు అందించబోతున్నట్లు తాజా క్లారిటీతో అర్థమవుతోంది.

గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తిస్థాయి దర్శకుడిగా వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ‘యానిమల్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఎలాంటి వైవిధ్యమైన సంగీతాన్ని ఇస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.