Deewana : ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తారురా పోరీలు.. ‘దీవాన’ టీజర్ రిలీజ్..

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. (Deewana)

  • Published On : March 12, 2026 / 10:31 AM IST

Deewana

Deewana : హర్షిత్ రెడ్డి, స్మేహ జంటగా తెరకెక్కుతున్న సినిమా దీవాన. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాణంలో శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది దీవాన సినిమా.

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే దీవాన తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ గా తెలుస్తుంది. చస్తావరా ఆ పిల్లకు అనే డైలాగ్ తో టీజర్ మొదలయి ఒక ప్రేమకథకు సంబంధించిన విజువల్స్ చూపించి చివర్లో ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తారు రా పోరీలు అనే డైలాగ్ తో సినిమాపై ఆసక్తి నెలకొల్పారు.

Also Read : Manika Sri : సింపుల్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ తో దండోరా హీరోయిన్.. మనికా చిక్కాల ఫొటోలు..

మీరు కూడా దీవాన టీజర్ రిలీజ్ చూసేయండి..