Akhil Akkineni : మూడేళ్లు బ్రేక్ అందుకే.. రెండు సర్జరీలు.. 48 కుట్లు : అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న లెనిన్ మూవీ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Thota Vamshi Kumar
- Published on- July 2, 2026 / 09:51 PM IST
Hero Akhil Akkineni explains why he takes break
Akhil Akkineni : అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ మూవీ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా అఖిల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఏజెంట్ మూవీ తరువాత మూడేళ్లు విరామం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించాడు.
ఏజెంట్ మూవీ రిలీజ్ అయిన మూడు నెలల తరువాత ప్రమాదవశాత్తు బాత్రూమ్‌లో పడిపోవడంతో ఎడమ చేతికి గాజు ముక్కలు గుచ్చుకోవడంతో తీవ్ర గాయమైందని చెప్పాడు. ఎడమ చేతి వేళ్లకు రెండు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చిందని, మొత్తం 48 కుట్లు పడినట్లు తెలిపాడు.
Samantha : జూన్ నెల ఓ అద్భుతం.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన సమంత
8 నెలల పాటు బరువులు కూడా ఎత్తలేకపోయినట్లు వెల్లడించాడు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 16 నెలలు పట్టినట్లు చెప్పాడు. సినిమాకు మూడేళ్లు విరామం తీసుకోవడంతో ఫ్యాన్స్ తనపై కోపంగా ఉన్నారన్నాడు. ఇకపై ఇలా జరగదని హామీ ఇస్తున్నట్లు చెప్పాడు.
ఇక లెనిన్ మూవీ గురించి మాట్లాడుతూ.. కథ వినగానే కొత్త అనుభూతి కలిగిందన్నాడు. వెంటనే నటించేందుకు అంగీకరించినట్లు చెప్పుకొచ్చాడు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథనాయిక.
