The Paradise collections : బాక్సాఫీస్ వ‌ద్ద ది ప్యార‌డైజ్ జోరు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

నాని న‌టించిన ది ప్యార‌డైజ్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ (The Paradise collections) సృష్టిస్తోంది.

Hero Nani The Paradise 4 Days Collections

The Paradise collections : నాని న‌టించిన ది ప్యార‌డైజ్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. విడుద‌లైన నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 155 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది.

ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. సెప్టెంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌క్షుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం రెండు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన‌ సంగ‌తి తెలిసిందే.

Vithika Sheru : వితికా షేరు వ‌ర్కౌట్లు.. ఫోటోలు వైర‌ల్‌..

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. క‌యాదు లోహ‌ర్ క‌థానాయిక‌గా న‌టించ‌గా మోహ‌న్ బాబు, సోనాలి కుల్‌క‌ర్ణి, ఈశ్వ‌రీ రావు, సంపూర్ణేశ్ బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క పాత్ర‌ల్లో పోషించారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ మూవీని నిర్మించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించారు.