Nara Rohith : నారా రోహిత్ కొడుకు పేరుకు అర్థం ఏమిటో తెలుసా?

టాలీవుడ్ హీరో నారా రోహిత్‌(Nara Rohith), సిరిలెల్లా దంప‌తుల‌కు ఈ ఏడాది జూన్‌లో బాబు పుట్టిన సంగ‌తి తెలిసిందే.

Hero Nara Rohith Reveals his Sons Name With First Family photos

Nara Rohith : టాలీవుడ్ హీరో నారా రోహిత్‌, సిరిలెల్లా దంప‌తుల‌కు ఈ ఏడాది జూన్‌లో బాబు పుట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ జంట త‌మ కుమారుడితో క‌లిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. అంతేకాదండోయ్‌.. త‌మ కుమారుడి పేరును సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. త‌మ కుమారుడికి నంద‌న్ రామ నారా అనే పేరును పెట్టిన‌ట్లు చెప్పారు.

సిరి బాబును ఎత్తుకోగా, రోహిత్ ప‌క్క‌నే చిరున‌వ్వులు చిందిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ మా కుమారుడిని ఈ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం అంటూ రాసుకొచ్చారు. ఇక‌ నంద‌న్ అంటే.. అంతులేని ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవాడ‌ని అర్థం. రామ అనే పేరును తాత‌గారి జ్ఞాప‌కార్థం గౌర‌వ‌సూచ‌కంగా జోడించిన‌ట్లు చెప్పారు. ఇది పేరు మాత్ర‌మే కాదని, కుటుంబ ప్రేమ‌, అమూల్య‌మైన జ్ఞాప‌కాలు అని తెలిపారు.

Bigg Boss Nominations : సుధీర్ ని పిచ్చ తిట్లు తిట్టిన సృష్టి.. కొట్టుకోడానికి రెడీ అయిన సుధీర్ – త్రిగున్.. నామినేషన్స్ ఫైర్ మాములుగా లేదుగా.. బిగ్ బాస్ 10 ‘డే 15’ ఎపిసోడ్..