Hero Nithin misses Balakrishna movie
Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు, ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ ఆయనకు మాత్రమే సొంతం. వేరే ఏ హీరో చేసినా ట్రోలింగ్ చేసేస్తారు నెటిజన్స్. కానీ, బాలకృష్ణ ఎం చేసినా ఆడియన్స్ యాక్సప్ట్ చేస్తారు. అది ఆయన రేంజ్. చాలా మంది టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా తమ సినిమాల్లో జై బాలయ్య(Balakrishna) నినాదాన్ని వాడుతూనే ఉంటారు. చాలా సినిమాల్లో అది మనం చూశాం కూడా.
కానీ, ఒక హీరో మాత్రం బాలకృష్ణ ఇచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఆ హీరో మరెవరో కాదు యూత్ స్టార్ నితిన్. అవును, బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం గతంలో నితిన్ కి వచ్చిందట. కానీ, ఈ హీరో మాత్రం నావల్ల కాదు నేను చేయలేను అని రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే అధినాయకుడు. పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకుడు. 2012లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
Anasuya Bharadwaj: పద్దతిగా పట్టుచీరలో.. అనసూయ క్రేజీ ఫోటోలు వైరల్
అయితే, ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం ముందుగా నితిన్ అని అనుకున్నాడట పరుచూరి మురళి. దానికి కారణం, నితిన్ అప్పటికి చాలా కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్నారు. కనీసం, ఆ రోల్ చేస్తే మంచి పేరు వస్తుంది అని నితిన్ అని అడిగాడట. కానీ, నితిన్ మాత్రం ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. దానికి, కారణం బాలకృష్ణ ఎదురుగా నిల్చిని నటించే అంత ధైర్యం తనకు లేదని, ఆయనతో నటించే నావల్ల కాదని చెప్పేశాడట.
దాంతో, నితిన్ పాత్రను తీసేసి కథను కాస్త మార్చి అధినాయకుడు సినిమా చేశారు పరుచూరి మురళి. అలా బాలకృష్ణ మీద ఉన్న గౌరవంతోనే నితిన్ ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. ఈ విషయం గురించి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దర్శకుడు పరుచూరి మురళి. దాంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.