Paanch Minar OTT: రిలీజైన వారానికే ఓటీటీకి వచ్చేసిన ‘పాంచ్‌మినార్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ పాంచ్‌మినార్(Paanch Minar OTT). లేటెస్ట్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు రమేష్ కుడుములు తెరకెక్కించాడు.
Hero Raj Tarun new movie Paanch Minar Movie Now streaming on Amazon Prime
Paanch Minar OTT; టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ పాంచ్‌మినార్(Paanch Minar OTT). లేటెస్ట్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు రమేష్ కుడుముల తెరకెక్కించాడు. క్రైం కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా నవంబర్ 21న థియేటర్స్ లోకి వచ్చింది. చాలా కాలం గ్యాప్ తరువాత హీరో రాజ్ తరుణ్ చేసిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్సుడ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్నంత సక్సెస్ కాలేదు ఈ సినిమా. దీంతో విడుదలై వారం కూడా గడవక ముందే ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచినా ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
Mangli: ఫోక్ సింగర్ మంగ్లీపై వల్గర్ కామెంట్స్.. ఫిర్యాదు మేరకు వ్యక్తి అరెస్ట్..
