Mangli: ఫోక్ సింగర్ మంగ్లీపై వల్గర్ కామెంట్స్.. ఫిర్యాదు మేరకు వ్యక్తి అరెస్ట్..

తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీ(Mangli)పై ఆ వ్యక్తి అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆవ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

Mangli: ఫోక్ సింగర్ మంగ్లీపై వల్గర్ కామెంట్స్.. ఫిర్యాదు మేరకు వ్యక్తి అరెస్ట్..

Folk singer Mangli files case against man who made lewd comments on her

Updated On : November 28, 2025 / 7:15 AM IST

Mangli: తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై ఆ వ్యక్తి అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆవ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. అసలు విషయం ఏంటంటే, సింగర్ మంగ్లీ నుంచి వచ్చిన రీసెంట్ సాంగ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఆ పాటకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, సదరు వ్యక్తి మాత్రం ఆ పాటపై, ఆ పాట పాడిన మంగ్లీ(Mangli)పై అసభ్యకరమైన రీతిలో దారుణమైన కామెంట్స్ చేస్తూ వీడియో విడుదల చేశాడు. దాంతో, ఆ వ్యక్తిపై ఏఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మంగ్లీ.

Lingusamy: ఇది రీ రిలీజ్ కాదు.. రీ ఎడిటెడ్ వెర్షన్ రిలీజ్.. ఇప్పుడైనా ఫలితం మారుతుందా.. పాపం

ఈ కేసుపై వెంటనే స్పందించిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహిళా గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు, షెడ్యూల్డ్ తెగలను అవమానించేలా కామెంట్స్ చేసినందుకు అతనిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనపై సింగర్ మంగ్లీ మాట్లాడుతూ.. “నా పాటలు ప్రజలకు ఆనందాన్ని కలిగించినప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. కానీ, నీచమైన కామెంట్స్ విన్నప్పుడు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఒక మహిళగా, అందులోను ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఇలాంటివి సహించలేను. నాకు చట్టంపై నమ్మకం ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.