Lingusamy: ఇది రీ రిలీజ్ కాదు.. రీ ఎడిటెడ్ వెర్షన్ రిలీజ్.. ఇప్పుడైనా ఫలితం మారుతుందా.. పాపం
సూర్య అంజాన్ సినిమా రీ ఎడిటెడ్ వెర్షన్ రిలీజ్ చేస్తున్న దర్శకుడు లింగుస్వామి(Lingusamy). అక్కడ హిట్ అయితే తెలుగులో కూడా విడుదుల చేస్తారట
Director Lingusamy is releasing a re-edited version of Surya Anjaan Movie
Lingusamy: తమిళ స్టార్ సూర్యకి ఉన్న క్రేజ్ గురించి పెత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అందుకే ఆయనకు సౌత్ మొత్తం మంచి క్రేజ్ ఏర్పడింది. నిజానికి సూర్య రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటాడు. కానీ, మంది ఫేమ్ వచ్చిన తరువాత చేయక తప్పలేదు. అలా ఆయన కెరీర్ లో చేసిన పక్కా కమర్షియల్ సినిమా అంజాన్. ఇదే సినిమాను తెలుగులో సికిందర్ పేరుతో విడుదల చేశారు. సూర్య కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించగా ఆ టైం లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కానీ, విడుదల తరువాత మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా.
Manchu Lakshmi: నా కుటుంబం ఎప్పటిలా కలిసిపోవాలి.. నాకున్న ఏకైక కోరిక అదే.. ఆ దేవుడు వరం ఇస్తే..
సూర్య కెరీర్ లోనే బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సూర్య ఆ తరువాత సినిమాలతో కోలుక్కున్నప్పటికీ దర్శకుడు మాత్రం ఆ ట్రాజిడీ నుంచి ఇంకా బయటకు రాలకేపోతున్నాడు. 2014 నుంచి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా హిట్ ఇవ్వలేకపోయాడు ఈ దర్శకుడు. అంతలా తన కెరీర్ ను దెబ్బతీసింది ఈ సినిమా. అందుకే, మళ్ళీ అదే సినిమాతో తాను ఏంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు దర్శకుడు లింగుస్వామి(Lingusamy). నవంబర్ 28న ఈ సినిమా రీ ఎడిటెడ్ వెర్షన్ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. ఈమేరకు ప్రెస్ మీట్ కూడా నిర్వహించాడు.
ఈ సందర్బంగా దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ..”అంజాన్ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. కానీ, ఆ టైంలో సరిగా ఎడిట్ చేయాలపొయాం. అందుకే ఆ ఫలితం వచ్చింది. రిలీజ్ విషయంలో తొందరపాటు, టైం లేకపోవడం వల్ల ఎడిటింగ్ సరిగా చేయలేకపోయాము. దాంతో, హడావుడిగా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా పొరపాట్లు కూడా జరిగాయి. కానీ, ఈ సినిమాను అంతలా ట్రోల్ చేయడం బాధకలిగించింది. ఇప్పుడు ఏఈ సినిమాను రీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తున్నాం. దాదాపు అరగంట సన్నివేశాలను తీసేశాం. ఇప్పుడు సినిమా చాలా బెటర్ అయ్యింది. సూర్య ఫ్యామిలీకి కూడా నచ్చింది. సూర్య అభిమానులకు కూడా తప్పకుండా నచ్చుతుంది. దీనికి వచ్చే స్పందనను బట్టీ తెలుగులో కూడా ‘సికిందర్’ను రీ రిలీజ్ చేస్తాం. అలాగే సికిందర్ సినిమాకు సీక్వెల్ కూడా దానిపైనే ఆధారపడి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు లింగుస్వామి.
