Manchu Lakshmi: నా కుటుంబం ఎప్పటిలా కలిసిపోవాలి.. నాకున్న ఏకైక కోరిక అదే.. ఆ దేవుడు వరం ఇస్తే..

మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తనకు దేవుడు కనిపించి వరం కోరుకో అంటే నా కుటుంబం ఎప్పటిలా కలిసిపోవాలి అని కోరుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రతీ ఫ్యామిలీలో గొడవలు కామన్ అని చెప్పింది.

Manchu Lakshmi: నా కుటుంబం ఎప్పటిలా కలిసిపోవాలి.. నాకున్న ఏకైక కోరిక అదే.. ఆ దేవుడు వరం ఇస్తే..

Actress Manchu Lakshmi made emotional comments saying that she wants to reunite with her family.

Updated On : November 27, 2025 / 12:32 PM IST

Manchu Lakshmi: మంచు లక్ష్మి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తనకు దేవుడు కనిపించి వరం కోరుకో అంటే నా కుటుంబం ఎప్పటిలా కలిసిపోవాలి అని కోరుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రతీ ఫ్యామిలీలో గొడవలు కామన్ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మంచు లక్ష్మి ఇటీవల ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొంది. అందులో ఆమె మాట్లాడుతూ.. తన పర్సనల్, ప్రొఫెషనల్, ఫ్యామిలీ గురించి చాలా విషయాల గురించి చెప్పింది. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఈమధ్య మంచు ఫ్యామిలీ జరిగిన డిస్టర్బెన్స్సెస్ గురించి ప్రస్తావించింది.

Vijay Deverakonda: ప్రాణాలు తోడేస్తున్నారు.. ఎప్పుడూ చేయలేదు ఇలా.. చాలా డిమాండ్ చేస్తున్నాయి..

దానికి సమాధానంగా మంచు లక్ష్మి(Manchu Lakshmi) మాట్లాడుతూ..’ఆ దేవుడు వచ్చి ఓ వరం కోరుకోమంటే. నా కుటుంబం అంతా మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటాను. ప్రతీ కుటుంబాల్లో గొడవలు సహజం. ఎన్ని గొడవలు వచ్చినా చివరకు కలవాల్సిందే. కొంతమంది గొడవలైతే ఇక జీవితాంతం కలవకూడదని అనుకుంటారు. మనకు ఎన్ని ఉన్నా చివరకు మిగిలేది రక్తసంబంధీకులు మాత్రమే. కుటుంబంతో సంతోషంగా కలిసి ఉండటానికి ఎన్ని పోరాటాలైనా చేయాలి.

నేను ఈ మధ్య ముంబైలో ఉంటునాన్ను. ఇక్కడ గొడవలు జరిగినప్పుడు నేను బాధపడటం లేదు అని చాలా మంది ఆర్టికల్స్ రాశారు. నేను ఎంతగా ఫీల్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. కానీ, ఆ వార్తలకు స్పందించాలని అనుకోలేదు. కానీ, నా కుటుంబంలో ఇలా జరుగుతుంది అని కలలో కూడా ఊహించలేదు. చాలా బాధేసింది. అయినా ఇది మా వ్యక్తిగత విషయం అందుకే స్పందించాలని అనుకోలేదు”అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది మంచు లక్ష్మి. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ ఆమె మంచు లక్ష్మికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.