Ram Pothineni: హీరో రామ్ రాసుకున్న కథ ‘ది లోన్ వోల్ఫ్’.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

స్వయంగా రాసుకున్న కథతో సినిమా చేస్తున్న హీరో రామ్(Ram Pothineni).

hero ram pothineni next movie title as the lone wolf

  • రామ్ హీరోగా ‘ది లోన్ వోల్ఫ్’
  • స్వయంగా కథ కూడా సిద్ధం చేసిన రామ్
  • మే 15న అధికారిక ప్రకటన వచ్చే అవకాశం

Ram Pothineni: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఆయన నటించిన ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక చాలా ఆశలు పెట్టుకున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కూడా ప్లాప్ లిస్టులోకి చేరిపోయింది. అందుకే, తన తదుపరి సినిమా విషయంలో రామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే గత చిత్రాల ఫలితాల విశ్లేషణలో భాగంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ సుదీర్ఘ విరామం తీసుకున్నారు.

Nidhi Agarwal: వెకేషన్‌లో నిధి అగర్వాల్ సందడి.. ఫ్యామిలీతో క్యూట్ ఫొటోలు చూశారా

ఈ విరామంలో వైవిధ్యమైన కథలపై దృష్టి సారించి, అభిమానుల అంచనాలను అందుకునేందుకు సిద్ధమవుతున్నారు.ఆ కథను కూడా ఆయనే రాసుకున్నాడు. అయితే, ఈ కథకు ‘ది లోన్ వోల్ఫ్’ (The Lone Wolf) అనే ఆసక్తికరమైన టైటిల్‌ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. నటుడిగానే కాకుండా ఈసారి రచయితగా తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేయబోతున్నారు రామ్(Ram Pothineni). ఎనర్జిటిక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కథ సిద్ధమైనప్పటికీ, దీనికి దర్శకత్వం వహించే డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. కథా బలానికి తగ్గట్టుగా రామ్ ఒక ప్రతిభావంతుడైన దర్శకుడి కోసం వెతుకుతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అసిస్టెంట్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడనే కామెంట్స్ వినిపించినట్టికీ అధికారిక ప్రకటన రాలేదు. మే 15 రామ్ పోతినేని బర్త్ డే సందర్బంగా ఆ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి రామ్ స్వయంగా రాసుకున్న ఈ ‘ది లోన్ వోల్ఫ్’ చిత్రం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందా? బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందా? అనేది చూడాలి.