Heros
Heros : అప్పుడప్పుడు మన సినిమా సెలబ్రిటీలు వాళ్ళ చిన్నప్పటి ఫొటోలు షేర్ చేయడంతో అవి వైరల్ గా మారతాయి. తాజాగా ఓ హీరో తమ చిన్నప్పటి ఫోటో షేర్ చేసాడు. ఈ ఫొటోలు షేర్ చేస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్నది ఎవరో అనుకున్నారా? హీరోలు, అన్నదమ్ములు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ప్రభాస్ వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ కొడుకులు ఈ ఇద్దరూ. చైల్డ్ ఆర్టిస్ట్ గానే పలు సినిమాలు చేసిన సంతోష్, సంగీత్ ఇప్పుడు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. తమ్ముడు సంగీత్ శోభన్ మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, 3 రోజెస్, ఒక చిన్న ఫ్యామిలీ కథ.. ఇలా వరుసగా సినిమాలు, సిరీస్ లతో హిట్స్ కొడుతున్నాడు. త్వరలోనే రాకాస అనే సినిమాతో రాబోతున్నాడు.
Also Read : Harsha Vardhan : పవన్ కళ్యాణ్ గారితో వారం రోజులు పనిచేసాను.. అప్పటి సంగతులు చెప్పిన హర్షవర్ధన్..
ఇక సంతోష్ గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉండగా ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో హిట్ కొట్టాడు. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా ఈ సినిమా ప్రేక్షకులని థియేటర్స్ లో మెప్పిస్తుంది. చాన్నాళ్ల తర్వాత అన్నయ్య సంతోష్ శోభన్ హిట్ కొట్టడంతో చిన్నప్పుడు దిగిన ఫొటోలు, తమ తల్లితో దిగిన ఫొటోలు షేర్ చేసి స్పెషల్ పోస్ట్ చేసాడు సంగీత్.
ఈ పోస్ట్ లో సంగీత్.. మనలో ప్రతి శుక్రవారం ఎవరికో ఒకరికి రాసిపెట్టి ఉంటుంది. ఈ శుక్రవారం నీది. నీ బట్టలు వేసుకొని ఎపుడూ నీకు సపోర్ట్ గా ఉంటాను. జీవితం చివరి వరకు నీతోనే ఉంటాను అని ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. గోల్కొండ హై స్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా కలిసి మెప్పించిన సంతోష్ – సంగీత్ ఇప్పుడు ఇలా హీరోలుగా దూసుకెళ్తుండటం గ్రేట్ అని అభినందిస్తున్నారు. ప్రభాస్ సపోర్ట్ ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఎప్పుడూ ఉంటుంది. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసాడు ప్రభాస్.
Also See : Anjali : ఫిలిం ఫేర్ కోసం అంజలి స్పెషల్ లుక్స్.. ఫొటోలు..