×
Ad

Sreevishnu: వివేక్ దగ్గర ‘మాస్టర్ ప్లాన్’.. ఇండియన్ సినిమాను షేక్ చేసే కథలు.. శ్రీవిష్ణు ఆసక్తికర కామెంట్స్

దర్శకుడు వివేక్ ఆత్రేయ తదుపరి సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరో శ్రీవిష్ణు(SreeVishnu).

Hero Sreevishnu interesting comments about director Vivek Athreya

  • వివేక్ దగ్గర సాలిడ్ కథలు
  • ఇండియాను షేక్ సినిమాలతో వస్తున్నాడు
  • వివేక్ గురించి శ్రీవిష్ణు ఆసక్తికర కామెంట్స్

Sreevishnu: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మృత్యుంజయ. ఇంతకాలం తన కామెడీతో ఆకట్టుకున్న ఈ హీరో ఫస్ట్ టైం థ్రిల్లర్ జానర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. ఈ సినిమాతో శ్రీవిష్ణు తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

అయితే, మృత్యుంజయ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు హీరో శ్రీవిష్ణు(Sreevishnu). ఈ ఇంటర్వ్యూలో మృత్యుంజయ సినిమా గురించి, తన తదుపరి సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు శ్రీవిష్ణు. ఆలాగే, తన బెస్ట్ ఫ్రెండ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు. వివేక్ ఆత్రేయ చాలా గొప్ప దర్శకుడు. తన కథలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. మేము చేసిన మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలు కూడా అలా వచ్చినవే.

Sravanthi Chokkarapu: యాంకర్ స్రవంతి కొడుకు అకీరా బర్త్ డే.. సోషల్ మీడియాలో స్పెషల్ ఫొటోస్ వైరల్

నిజానికి వివేక్ ఆత్రేయ దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. అతని దగ్గర ఇండియాను షేక్ చేసే మూడు కథలు ఉన్నాయి. ఆ కథలు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అంటే ఏంటో తెలియజేసే కథలు. వాటిని ఎవరితో తీస్తాడు, ఎప్పుడు తీస్తాడు అనేది తెలియదు కానీ, వచ్చినప్పుడు మాత్రం ఇండియన్ సినిమాను పూర్తిగా మార్చేస్తాయి. కానీ, ఆ సినిమాలు చేయడానికి వివేక్ ఆత్రేయ బ్రాండ్ ఇంకా చాలా పెరగాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో, వివేక్ ఆత్రేయ గురించి శ్రీవిష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వివేక్ ఆత్రేయ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన బాలకృష్ణ కోసం ఒక సాలిడ్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఈ కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని టాక్. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.