Sudheer Babu : కుప్పంలో సినిమా తీసి.. చంద్రబాబును కలిసిన సుధీర్ బాబు..
హీరో సుధీర్ బాబు కాబోయే సీఎం చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- June 10, 2024 / 04:16 PM IST
Hero Sudheer Babu met Chandrababu Naidu
Sudheer Babu – Chandrababu Naidu : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 12న నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు బావమరిది, హీరో సుధీర్ బాబు కాబోయే సీఎం చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
మహేశ్ బాబు బావ, గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తన తోడల్లుడు సుధీర్ బాబును చంద్రబాబుకు వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంలో చంద్రబాబుకు సుబ్రమణ్య స్వామి విగ్రహాన్ని సుదీర్ బాబు అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా.. శివ మనసులో శృతి అనే మూవీతో హీరోగా మారిన సుధీర్ బాబు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన హరోం హర మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. 1980 బ్యాక్ డ్రాప్తో ఈ మూవీ రూపుదిద్దుకుంది. జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మించారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మొత్తం చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గం చుట్టూనే ఉంటుందట.
