Vijay Deverakonda : విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్.. అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్తగా దగ్గరైన హీరో..

ఎప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఇవాళ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో విజయ్.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్.. అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్తగా దగ్గరైన హీరో..

Vijay Deverakonda Birthday Special Story

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ.. ఇప్పుడు యూత్ లో మారుమోగుతున్న పేరు. హీరో అంటే ఇలాగే ఉండాలి అన్న స్టీరియో టైప్ కి టాటా చెప్పి ఎలా ఉన్నా ప్రేక్షకులకు, అభిమానులకు దగ్గరవ్వడం ముఖ్యం అని సరికొత్త యాటిట్యూడ్ తో, పలకరింపులతో స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఎలాంటి ఇండస్ట్రీ సపోర్ట్ లేకుండా కింద నుంచి పైకి ఎదిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఎప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఇవాళ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో విజయ్.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ తో నాని పక్కన మెప్పించిన విజయ్ దేవరకొండ ఇవాళ నాని మార్కెట్ ని మించి సినిమాలు చేస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో సాఫ్ట్ బాయ్ గా కనపడి ప్రేక్షకులని మెప్పించి హిట్ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ బాయ్ గా మారి ఇండస్ట్రీకి సరికొత్త హీరో యాటిట్యూడ్ పరిచయం చేశాడు. ఆ ఒక్క సినిమాతో స్టార్ హీరోల సరసన చేరిపోయాడు విజయ్. టాక్సీవాలాతో క్యూట్ రొమాంటిక్ సీన్స్ కూడా చేయగలను అని చూపించి గీతగోవిందం సినిమాతో 100 కోట్ల సక్సెస్ కొట్టాడు. అప్పటికే విజయ్ పేరు తెలుగు స్టేట్స్ లోనే కాదు బయటి రాష్ట్రాల్లో కూడా మోత మోగిపోతుంది.

Also Read : Ashu Reddy : పేరు మార్చుకున్న అషురెడ్డి.. ఇప్పుడైనా కలిసొస్తుందా?

బాలీవుడ్ లో సైతం చాలా మంది హీరోయిన్స్ మీకు ఏ తెలుగు హీరోతో చేయాలని ఉందని అడిగితే తడుముకోకుండా విజయ్ దేవరకొండ అని చెప్పినవాళ్లు ఉన్నారు. లైగర్ సినిమాతో బాలీవుడ్ ని షేక్ చేసాడు. ఆ సినిమా కమర్షియల్ గా అంతగా వర్కౌట్ అవ్వకపోయినా విజయ్ బాలీవుడ్ ఎంట్రీకి బాగా ఉపయోగపడింది. బాలీవుడ్ స్టార్స్ సైతం విజయ్ ని కలవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఖుషీగా ఫ్యామిలీ స్టార్ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు. అన్ని భాషల్లో విజయ్ అభిమానులని సంపాదించుకున్నాడు.

ఇప్పుడు విజయ్ చేతిలో భారీ పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఓ పాన్ ఇండియా సినిమా, సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ పీరియాడిక్ స్పై సినిమా, మైత్రి నిర్మాణంలో ఓ భారీ సినిమా ఉన్నాయి. ఇవే కాకుండా విజయ్ కి ఇంకా బోలెడన్ని కథలు వస్తున్నాయి. సినిమాల పరంగా టాలీవుడ్ లో ఎప్పుడో స్టార్ హీరో స్థాయిని సంపాదించాడు. ఇక ఈవెంట్స్ లో, పబ్లిక్ మీటింగ్స్ లో మై డియర్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ సరికొత్తగా అభిమానులకు, ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరోవైపు వరుసగా యాడ్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రౌడీ బ్రాండ్ తో క్లాతింగ్ బిజినెస్ లోకి, AVD థియేటర్, వాలీబాల్ టీమ్ తో.. ఇలా పలు బిజినెస్ లలో కూడా అడిగి సక్సెస్ అయ్యాడు.

Vijay Deverakonda

విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగినా తను ఓ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి, తన కష్టాలు మర్చిపోకుండా పలువురికి సహాయాలు చేస్తున్నాడు. కరోనా సమయంలో దేవరకొండ ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది పేద, మధ్య తరగతి వాళ్లకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసాడు. యువత కోసం ఉపాధి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసాడు. దేవరశాంట పేరుతో తన ఫ్యాన్స్ లో కొంతమందిని సెలెక్ట్ చేసి టూర్స్ కి పంపించాడు. తన పుట్టిన రోజున పలు నగరాల్లో ఫ్రీగా ఐస్ క్రీం పంచిపెడతారు. ఇటీవల ఖుషి సినిమా టైంలో అవసరం ఉన్న వంద కుటుంబాలని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం కోటి రూపాయలు పంచాడు. ఇలా సేవా కార్యక్రమాలతో కూడా అందరి అభినందనలు అందుకుంటున్నాడు విజయ్.

ఇక నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు నిన్నటి నుంచే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు విజయ్ దేవరకొండకు స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. దీంతో ఈ సంవత్సరం తన పుట్టిన రోజుని అక్కడే షూటింగ్ సెట్లో జరుపుకోనున్నాడు.

Vijay Deverakonda