Yash: ‘టాక్సిక్’ అలాంటి సినిమా కాదు.. కన్నడ స్టార్ యష్ ఆసక్తికర కామెంట్స్
టాక్సిక్ సినిమాలో అలాంటివి ఉండవు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యష్(Yash).
- V Santhosh Kumar
- Published on- April 15, 2026 / 05:16 PM IST
Hero Yash interesting comments on Toxic movie
- టాక్సిక్ పై యష్ షాకింగ్ కామెంట్స్
- ఇది గ్యాంగ్‌స్టర్ కథ కాదని చెప్పారు
- ప్రేక్షకులకు సరికొత్త అనుభూతుని అందిస్తుందన్నారు
Yash: కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మార్చి 19న విడుదల కావాల్సింది కానీ, అనుకోని కారణాల వల్ల జూన్ 4వ తేదీకి వాయిదా పడింది. అయితే, టాక్సిక్ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అందరూ ఇది మరో గ్యాంగ్‌స్టర్ కథ అని భావిస్తున్నారు. కానీ, ఇది అలాంటి సినిమా కాదని ఆయన స్పష్టం చేశారు కన్నడ స్టార్ యష్(Yash).
Jana Nayagan: ఎట్టకేలకు థియేటర్స్ కి వస్తున్న ‘జన నాయగన్’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ఇప్పటివరకు వెండితెరపై రాని సరికొత్త కథాంశంతో, ఒక విభిన్నమైన జోనర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు యశ్ వెల్లడించారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కదిలించే బలమైన భావోద్వేగాలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ‘టాక్సిక్’ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని, ఈ సినిమా ప్రేక్షకులను ఒక సరికొత్త విజువల్ ప్రపంచంలోకి తీసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభిమానులు తన నుంచి ఆశించే అన్ని అంశాలను మేళవిస్తూనే, ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని, తన కెరీర్‌లో ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ గురించి కూడా యశ్ పలు విషయాలు పంచుకున్నారు. ఇందులో రావణుడిగా నటిస్తున్న ఆయన, రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్‌తో తనకు తొలి భాగంలో ఎటువంటి కాంబినేషన్ సీన్లు లేవని స్పష్టం చేశారు. అయితే రణ్‌బీర్ అద్భుతమైన నటుడని, సినిమా పట్ల తమ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటం ప్రాజెక్ట్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అని కొనియాడారు. దీంతో, యష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
