Mohan Babu : మోహన్ బాబు అరెస్ట్ తప్పదా? మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు..

రంజిత్ అనే ఓ జర్నలిస్ట్ పై దాడి చేయడంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదయింది.

Mohan Babu : మోహన్ బాబు అరెస్ట్ తప్పదా? మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు..

High Court Dismiss Mohan Babu Bail Petition Mohan Babu will Arrest Rumours goes Viral

Updated On : December 23, 2024 / 6:15 PM IST

Mohan Babu : మంచు కుటుంబంలో వివాదం చల్లారినట్టు కనిపిస్తున్నా మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసినా వివాదం మాత్రం ఇంకా కొనసాగుతుంది. తన ఇంటికి వచ్చిన జర్నలిస్టులలో రంజిత్ అనే ఓ జర్నలిస్ట్ పై దాడి చేయడంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదయింది. మోహన్ బాబు ఆ జర్నలిస్ట్ ని పరామర్శించిన తర్వాత పరారీలో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి.

ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి మోహన్ బాబుని అరెస్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా తాజాగా హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నట్టు అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాలు చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు.

Also Read : Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ నా కొడుకు వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. అభిమాని తల్లి ఆవేదన..

మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన న్యాయవాది రవిచందర్ తెలపడంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్ లో ఉన్నారని ఆయన న్యాయవాది తెలిపారు. సరైన రిపోర్టులు చూపించకపోవడంతో హైకోర్టు మోహన్ బాబు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. దీంతో ఏ క్షణమైనా మోహన్ బాబు అరెస్ట్ అవ్వొచ్చు అని తెలుస్తుంది. దీనిపై మోహన్ బాబు బయటకు వచ్చి స్పందిస్తాడేమో చూడాలి.

మరోవైపు జర్నలిస్టు రంజిత్ స్టేట్మెంట్ ను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ నెల 11న రంజిత్ స్టేట్మెంట్ ను రీ రికార్డు చేసి సమర్పించడంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది.

మంచు కుటుంబంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేసి తనపై దాడి చేసారని పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత మోహన్ బాబు కూడా మనోజ్ దాడి చేసాడని కంప్లైంట్ చేయడం, విష్ణు తనని ఇంట్లోకి రానివ్వలేదని మనోజ్ చెప్పడం, మనోజ్ తల్లి కూడా మనోజ్ దే తప్పంతా అంటూ ఓ లేఖ రిలీజ్ చేయడంతో ఈ వివాదం కొనసాగుతుంది. ప్రస్తుతం మనోజ్ అయితే ఆళ్లగగడ్డకు వెళ్ళిపోయాడు. విష్ణు, మోహన్ బాబు కూడా ఈ వివాదం గురించి మాట్లాడట్లేదు.

Also Read : Allu Arjun : గెట్ రెడీ బన్నీ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎక్స్‌క్లూజివ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పట్నుంచో తెలుసా?