Allu Arjun : గెట్ రెడీ బన్నీ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎక్స్‌క్లూజివ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పట్నుంచో తెలుసా?

తాజాగా నిర్మాత నాగవంశీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి 10 టీవీతో మాట్లాడుతూ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.

Allu Arjun : గెట్ రెడీ బన్నీ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎక్స్‌క్లూజివ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పట్నుంచో తెలుసా?

Allu Arjun Next Movie with Trivikram Exclusive Shooting Update by Producer Naga Vamsi

Updated On : December 23, 2024 / 1:27 PM IST

Allu Arjun : ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో భారీ పాన్ ఇండియా సక్సెస్ కొట్టాడు. ఆల్మోస్ట్ 1500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు. అయితే సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో బన్నీ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చే న్యూస్ వచ్చింది.

గతంలో సంవత్సరం క్రితమే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని, హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్, గీత ఆర్ట్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో.. త్రివిక్రమ్ తో బన్నీ తీయబోయే సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని, రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో ఈ సినిమా ఉండబోతుందని, దేశంలో ఎవ్వరూ చూడని ఓ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాని తీయబోతున్నామని అన్నారు.

Also Read : Daaku Maharaaj : ‘డాకు మ‌హారాజ్’ ప్ర‌మోష‌న్లు గ‌ట్టిగానే ప్లాన్ చేశారుగా.. ఎక్క‌డ ఏ ఈవెంట్ జ‌ర‌గ‌నుందంటే?

తాజాగా నిర్మాత నాగవంశీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి 10 టీవీతో మాట్లాడుతూ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మార్చ్ నెల నుంచి మొదలు కానుంది. మొదట హీరో లేని సీన్స్ షూట్ చేస్తారు. అనంతరం బన్నీ జూన్ లో షూటింగ్ లో జాయిన్ అవుతాడు అని తెలిపారు. దీంతో నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వార్తతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక గతంలో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలు వచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించాయి. ఇప్పుడు వీరిద్దరూ నాలుగోసారి కలిసి సినిమా చేస్తుండటం, భారీ బడ్జెట్ సినిమా కావడం, త్రివిక్రమ్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం, రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ అని నిర్మాత చెప్పడంతో ఇప్పట్నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.