Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ప్రమోషన్లు గట్టిగానే ప్లాన్ చేశారుగా.. ఎక్కడ ఏ ఈవెంట్ జరగనుందంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ డాకు మహారాజ్.

Nandamuri Balakrishna Daaku Maharaaj trailer lanch event in hyd
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో ఈ చిత్ర తెరకెక్కుతోంది. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తమన్ సంతాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం 2025 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను చాలా గట్టిగానే ప్లాన్ చేసింది. తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. జనవరి 2న ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు.
Ram charan : అమెరికాలో తన నెక్ట్స్ రెండు సినిమాల దర్శకులతో రామ్‌చరణ్.. పిక్స్ వైరల్
ఇక జనవరి 4న అమెరికాలో ఓ ఈవెంట్‌ను నిర్వహించనున్నామని, అక్కడ ఓ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లుగా తెలిపారు. జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఇటీవలే విడుదల చేసిన డేగ డేగ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాప్స్ వచ్చింది. చిన్ని అంటూ సాగే రెండో పాటను నేడు విడుదల చేయనున్నారు.