Ram charan : అమెరికాలో తన నెక్ట్స్ రెండు సినిమాల దర్శకులతో రామ్‌చరణ్.. పిక్స్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ గేమ్‌ఛేంజర్

Ram charan with Next Two films directors in America
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ గేమ్‌ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
ఈ ఈవెంట్ కు రామ్ చరణ్, శంకర్, తమన్, దిల్ రాజు.. ఇలా గేమ్ ఛేంజర్ టీమ్ అంతా వచ్చారు. దర్శకుడు సుకుమార్, బుచ్చిబాబులు అతిథులుగా వచ్చారు. ఈ క్రమంలో సుకుమార్ మాట్లాడుతూ.. నాకు చరణ్ అంటే చాలా ఇష్టం. బ్రదర్ లాంటి వాడు. మీకు ఒక రహస్యం చెప్తాను. చిరంజీవి సర్ తో కలిసి నేను ఈ సినిమా చూసాను. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్. శంకర్ సినిమాలు జెంటిల్మెన్, భారతీయుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసానో ఈ సినిమా అప్పుడు అంత ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చారు.
ఈ ఈవెంట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో దర్శకుడు బుచ్చిబాబు ఫోటోలను పోస్ట్ చేశాడు. చరణ్, సుకుమార్, బుచ్చిబాబు ఈ ఫోటోలలో ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఇద్దరు దర్శకులతో చరణ్ సినిమాలు చేయనున్నాడు.
ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ సినిమాను ప్రారంభించాడు. ఆర్‌సీ 16 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రం తరువాత సుకుమార్‌తో చరణ్ ఓ మూవీ చేయనున్నాడు.
ఆర్‌సీ17గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. కాగా.. చరణ్ ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్‌గా నిలవడంతో ఆర్‌సీ17 పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
View this post on Instagram