Rajeev Kanakala – Brahmaji : షోలో ఏడ్చేసిన రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ.. వాళ్ళు ముగ్గురూ ఇప్పుడు లేరంటూ..

ఈ ప్రోమోలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ ఎమోషనల్ అయ్యారు.

Rajeev Kanakala – Brahmaji : షోలో ఏడ్చేసిన రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ.. వాళ్ళు ముగ్గురూ ఇప్పుడు లేరంటూ..

Rajeev Kanakala and Brahmaji cried in a Entertainment Show while Remembering Those People

Updated On : December 22, 2024 / 9:04 PM IST

Rajeev Kanakala – Brahmaji : టీవీ షోలలో ఎంటర్టైన్మెంట్ తో పాటు అప్పుడప్పుడు వివాదాలు, ఎమోషన్స్ కూడా వస్తాయని తెలిసిందే. ఈటీవీ న్యూఇయర్ కు సుమ అడ్డా దావత్ అని ఓ స్పెషల్ ప్రోగ్రాం చేసింది. దానికి సంబంధించిన స్పెషల్ ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కు రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సమీర్, సుమ, సౌమ్య శారదా, రీతూ చౌదరి, అరియనా గ్లోరీ, హైపర్ ఆది, ఇమ్మాన్యుయేల్.. ఇలా పలువురు టీవీ స్టార్లు వచ్చారు. కామెడీతో పాటు పాటలు, డ్యాన్సులు, గేమ్స్ అన్ని ఈ ఈవెంట్లో ఉన్నాయి.

అయితే చివరగా ఈ ప్రోమోలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ ఎమోషనల్ అయ్యారు. రాజీవ్ కి వాళ్ళ తల్లితండ్రులు దేవదాస్ కనకాల, లక్ష్మి కనకాల విగ్రహం గిఫ్ట్ గా ఇచ్చారు. దివంగత నటీనటులు దేవదాస్, లక్ష్మి నటీనటులుగా కాకుండా నట గురువులుగా కుడా ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం చూసి మొదట నటుడు బ్రహ్మాజీ ఎమోషనల్ అయ్యారు. బ్రహ్మాజీ.. మాస్టారు, మేడం అంటాము మేము వాళ్ళను. మేము ఇవ్వాళ ఇక్కడ ఉన్నాము అంటే దానికి కారణం వాళ్ళే అంటూ ఎమోషనల్ అయ్యారు.

Also Read : Venkatesh – Balayya : బొబ్బిలిరాజాతో సమరసింహారెడ్డి.. బాలయ్య, వెంకటేష్ అన్‌స్టాపబుల్ షో గ్లింప్స్ రిలీజ్.. ఎపిసోడ్ ఎప్పుడంటే..

ఇక తన తల్లితండ్రుల ఫొటోని, స్క్రీన్ పై వేసిన తన ఫ్యామిలీ ఫొటోని చూసి రాజీవ్ కనకాల ఒక్కసారిగా ఏడ్చేశారు. రాజీవ్ కనకాల.. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం నేను వీళ్ళ కడుపున పుట్టడం, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు లేరు. నా తోడబుట్టింది లేదు, నన్ను కన్నవారు లేరు అంటూ ఏడ్చేశారు. దీంతో అక్కడున్న వారంతా కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ ప్రోగ్రాం ప్రోమో చూసేయండి..