Venkatesh – Balayya : బొబ్బిలిరాజాతో సమరసింహారెడ్డి.. బాలయ్య, వెంకటేష్ అన్‌స్టాపబుల్ షో గ్లింప్స్ రిలీజ్.. ఎపిసోడ్ ఎప్పుడంటే..
ఈ ఎపిసోడ్ షూటింగ్ నుంచి ఫొటోలు రిలీజ్ చేయగా తాజాగా చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రకటించారు.

Aha Unstoppable With NBK Balakrishna Venkatesh Episode Glimpse Released
Venkatesh – Balayya : ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి నేడు వెంకటేష్ వచ్చారు. వెంకటేష్ తో పాటు అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి కూడా వచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకీమామ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు. ఇద్దరు సీనియర్ హీరోలు కలిసి షో చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.
Also Read : Balakrishna – Venkatesh : బాలయ్య, వెంకిమామ అన్‌స్టాపబుల్ షూటింగ్ పూర్తి.. షూట్ నుంచి సరదా ఫొటోలు వైరల్..
ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ నుంచి ఫొటోలు రిలీజ్ చేయగా తాజాగా చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రకటించారు. ఈ గ్లింప్స్ లో.. వెంకటేష్ రాగా బాలయ్య వెల్కమ్ చెప్పారు. వెంకటేష్ తొడకొడితే, బాలయ్య వెంకీ ఆసనం వేశారు. ఇక ఈ ఎపిసోడ్ ని డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ ఎపిసోడ్ కోసం అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మీరు కూడా గ్లింప్స్ చూసేయండి..