Ram charan with Next Two films directors in America
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ గేమ్‌ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
ఈ ఈవెంట్ కు రామ్ చరణ్, శంకర్, తమన్, దిల్ రాజు.. ఇలా గేమ్ ఛేంజర్ టీమ్ అంతా వచ్చారు. దర్శకుడు సుకుమార్, బుచ్చిబాబులు అతిథులుగా వచ్చారు. ఈ క్రమంలో సుకుమార్ మాట్లాడుతూ.. నాకు చరణ్ అంటే చాలా ఇష్టం. బ్రదర్ లాంటి వాడు. మీకు ఒక రహస్యం చెప్తాను. చిరంజీవి సర్ తో కలిసి నేను ఈ సినిమా చూసాను. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్. శంకర్ సినిమాలు జెంటిల్మెన్, భారతీయుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసానో ఈ సినిమా అప్పుడు అంత ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చారు.
ఈ ఈవెంట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో దర్శకుడు బుచ్చిబాబు ఫోటోలను పోస్ట్ చేశాడు. చరణ్, సుకుమార్, బుచ్చిబాబు ఈ ఫోటోలలో ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఇద్దరు దర్శకులతో చరణ్ సినిమాలు చేయనున్నాడు.
ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ సినిమాను ప్రారంభించాడు. ఆర్‌సీ 16 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రం తరువాత సుకుమార్‌తో చరణ్ ఓ మూవీ చేయనున్నాడు.