Varanasi : వారణాసికి హాలీవుడ్ టెన్షన్..!

వారణాసికి (Varanasi ) మొన్నటివరకు ఓటీటీ టెన్షన్ పట్టుకుంటే..ఇప్పుడు ఓవర్సీస్ స్క్రీన్స్ బాధ వచ్చి పడిందట.

Hollywood Tension to Mahesh Babu Varanasi movie

Varanasi : భారీ బడ్జెట్‌తో వరల్డ్‌ వైడ్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కుతున్న వారణాసికి మొన్నటివరకు ఓటీటీ టెన్షన్ పట్టుకుంటే..ఇప్పుడు ఓవర్సీస్ స్క్రీన్స్ బాధ వచ్చి పడిందట. వారణాసి సినిమాకు ఓవర్సీస్ స్క్రీన్ వార్ అంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రాజమౌళి ఐమాక్స్ ఫార్మాట్‌లో తీస్తున్న ఈ విజువల్ వండర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

కానీ అదే టైమ్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేసిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్ నోవా, పానిక్ కేర్ ఫుల్లీ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ముందుగానే థియేటర్స్‌తో అగ్రిమెంట్లు చేసుకోవడంతో ఓవర్సీస్‌లో వారణాసికి స్క్రీన్లు దొరుకుతాయో లేదోనన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఐమాక్స్, ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్లు ఎక్కువగా హాలీవుడ్ సినిమాల చేతిలోనే ఉండిపోతాయని..వారణాసికి స్క్రీన్ల కొరత ఏర్పడొచ్చంటున్నారు.

Allu Arjun : ఎన్టీఆర్ క్లారిటీ.. బన్నీ సైలెన్స్ ఎందుకు..?

అయితే ఓవర్సీస్ స్క్రీన్‌ షార్టేజ్‌ డౌట్స్‌పై, రాజమౌళి టీమ్ మాత్రం సీరియస్‌గా ఫోకస్ పెట్టిందట. లైట్ తీసుకుంటే రిలీజ్‌ టైమ్‌లో ప్రెజర్ ఫేస్ చేయాల్సి వస్తుందని.. మేకర్స్ ఆప్షన్ టు అంటూ కొత్త స్ట్రాటజీకి తెరదీశారట. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్‌తో రీ-నెగోషియేషన్స్, స్పెషల్ ప్రీమియర్ ప్లాన్స్, లాంగ్ రన్ స్ట్రాటజీస్ వంటి ఆప్షన్స్ పరిశీలిస్తున్నారట. కంటెంట్ బలంగా ఉంటే స్క్రీన్‌లు వస్తాయన్న నమ్మకంతో జక్కన్న టీమ్‌ ముందుకెళ్తోందట. కానీ హాలీవుడ్ బిగ్ స్టూడియోస్ ప్రెజర్‌ను తట్టుకొని వారణాసి ఎలా నిలబడుతుందో చూడాలి మరి.