హృతిక్ రోషన్ నుంచి వరుణ్ ధావన్ వరకు ఉన్నసెలబ్రెటీల లివింగ్ రూమ్స్ ఎప్పుడైనా చూశారా!

  • Publish Date - April 4, 2020 / 07:39 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో సెలెబ్రిట్సీతో సహా అందరు ఇళ్లకే పరిమితమయ్యారు.

ఈ లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమైన బాలీవుడ్ సెలబ్రిటీలు రోజంతా ఇంట్లో ఏమి చేస్తున్నారో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అవి కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రియా చక్రవర్తి :

రియా చక్రవర్తి 21 రోజుల లాక్ డౌన్ లోకి వెళ్లిన కొద్ది రోజుల తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోని పోస్ట్ ని చేసింది. దాంతో ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో బాబీ మూవీలోని ‘బాహార్ సే అందర్ కొయ్యి అనా సఖే’పాట పాడుతూ, డాన్స్ చేస్తు కనిపిస్తుంది. అంతేకాకుండా అగ్గి పెట్టెలతో ఒక దానిపై ఒకటి పేరుస్తూ కనిపిస్తుంది.  ఇంట్లోనే  సురక్షితంగా ఉండండి, బయటకు వెళ్లకండి అంటూ వీడియోని షేర్ చేసింది. ఇప్పటివరకు ఈ వీడియోకి 55వేలకు పైగా లైక్లు వచ్చాయి.

సోనమ్ కపూర్ :

సోనమ్ కపూర్ ఇంటిలోని ఆధునిక ఫర్నిచర్, కళాత్మక చిత్రాల మధ్య వీడియో ఉంది. ఈ వీడియోలో మాట్లాడుతూ నాకు చాలా బాగా గుర్తుంది నేను డిస్నీ పిల్లవాడిని అంటూ నేను డిస్నీ+హాట్ స్టార్ రెడ్ కార్పెట్ ప్రీమియర్ కి హాజరు కావటానికి ఉత్సాహంగా ఉండలేకపోతున్నాను.  హాట్ స్టార్ ప్రీమియర్ కి సబ్ స్ర్కయిబ్ అవ్వండి నాతో కలిసి ఏప్రిల్ 2 నుంచి 6 గంటలకు దిలయన్ కింగ్ & ది న్యూ డిస్నీ + ఒరిజినల్ ది మాండలోరియన్ ఆన్ చూడండి అంటూ షేర్ చేసింది.

వరుణ్ ధావన్ :

వరుణ్ చిన్నతనం మెుత్తం డిస్నీ సినిమాలు చూడటం, బొమ్మలతో ఆడుకోవడంతో గడిచిపోయింది.  Iv గతంలో డిస్నీతో ఒక నటుడిగా మరియు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా సంబధం ఉంది. డిస్నీ + హాట్ స్టార్ లో ది లయన్ కింగ్ ప్లే చేస్తు తన టీవీ పక్కన నిలబడి దిగినట్టుగా కనిపిస్తుంది. ఆ ఫోటో ద్వారా ఆ గది ఎంత పెద్దగా ఉందో ఊహించవచ్చు.

పరిణీతి చోప్రా :

పరిణీతి చోప్రా డిస్నీ +హాట్ స్టార్ ప్రీమియర్ కోసం ట్యూన్ చేస్తుంది. అంతేకాకుండా ది లయన్ కింగ్ ని చూసే చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ లో ప్రతిధి చూడటానికి తెల్లగా కనిపిస్తుంది. 

కత్రినా కైఫ్ :

లాక్ డౌన్ కారణంగా  కత్రినా తన ఇంటిని శుభ్రం చేస్తు కనిపిస్తుంది. అంతేకాకుండా గదిలోని ప్రతి వస్తువు తుప్పుపట్టినట్టు కనిపిస్తుంది. ఇంటి ఊడుస్తున్న వీడియోని పోస్ట్ చేసింది. అలాగే ఆ గదిలో  ఆమెకు వచ్చిన అవార్డులను కలిగి ఉన్న పిరమిడ్ ఆకారపు ర్యాక్ కూడా కనిపిస్తుంది. 

హృతిక్ రోషన్ :

హృతిక్ ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండే ఫంక్షనల్ డిజైను ప్రేమిస్తాడు.  ఆరేళ్ల క్రితమే హృతిక్.. తన భార్య సుజానేకు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా పిల్లలు, సుజేనా తనతో కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సమయంలో పిల్లలతో కలిసి ఉండటం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ లాక్ డౌన్ తో తన ఇంట్లో ఎలా ఉందనే విషయాన్ని ఫోటోతో సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు