Hrudhayam Murali Trailer : ‘హృదయం మురళి’ ట్రైలర్ రిలీజ్.. నలుగురు హీరోయిన్స్.. తమన్ నటించిన సినిమా..
మీరు కూడా హృదయం మురళి ట్రైలర్ చూసేయండి.. (Hrudhayam Murali Trailer)
- Saketh U
- Published on- July 7, 2026 / 07:28 PM IST
Hrudhayam Murali Trailer
Hrudhayam Murali Trailer : తమిళ నటుడు అథర్వ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇదయం మురళి. ఈ సినిమా తెలుగులో హృదయం మురళిగా రాబోతుంది. ఈ సినిమాలో సంగీత దర్శకుడు తమన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో ప్రీతీ ముకుందన్, కాయదు లోహర్, జోనిత గాంధీ, నిహారిక NM లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా చాలా మంది తమిళ్ స్టార్స్ గెస్ట్ పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.
హృదయం మురళి సినిమా జులై 10న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. కాలేజీ డేస్ నుంచి ఉన్న కొంతమంది ఫ్రెండ్స్, వారి స్నేహం, వారి ప్రేమలతో యూత్ ఫుల్ కామెడీగా తెరకెక్కినట్టు తెలుస్తుంది.
Also Read : Nagarjuna : వామ్మో.. బిగ్ బాస్ సీజన్ 10కి నాగార్జున రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
మీరు కూడా హృదయం మురళి ట్రైలర్ చూసేయండి..
