Ameer Log Teaser : ‘అమీర్ లోగ్’ టీజర్ రిలీజ్.. హైదరాబాదీ దోస్తానా..
మీరు కూడా అమీర్ లోగ్ టీజర్ చూసేయండి.. (Ameer Log Teaser)
- Saketh U
- Published on- July 6, 2026 / 04:24 PM IST
Ameer Log Teaser
Ameer Log Teaser : అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి.. పలువురు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ సినిమాగా అమీర్ లోగ్ రానుంది.
ఈ సినిమాని రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా అమీర్ లోగ్ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా అమీర్ లోగ్ టీజర్ చూసేయండి..
Also See : Nabha Natesh : పలుచని నలుపు చీరలో నభా నటేష్ అందాలు.. ఫొటోలు..
టీజర్ లాంచ్ ఈవెంట్లో నిరణ్మత, స్టార్ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ.. అమీర్ లోగ్ సినిమాని నేను ఆల్రెడీ చూశాను. డబ్బు పరంగా రిచ్ అని అనుకుంటారు. కానీ స్నేహం, ప్రేమ విషయంలో రిచ్ అని మిడిల్ క్లాస్ జీవితాల్ని ఈ సినిమాలో చూపించారు. ప్రాపర్ హైదరాబాద్‌ను చూపించిన సినిమాల లిస్ట్ లో అమీర్ లోగ్ ఉంటుంది అని అన్నారు. దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ.. నేను రాసిన కథను నటనతో ఇంకో లెవెల్‌కి తీసుకువెళ్లారు మా ఆర్టిస్టులు అని అన్నారు.
