×
Ad

Emandi Ravi: సజ్జనార్ గారు.. మా వాడు వెధవే కానీ.. ఈ ఒక్క పనిచేయండి దండం పెడతా.. ఇమ్మడి రవి తండ్రి కన్నీరుపెట్టించే రిక్వెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.(Emandi Ravi) గత కొన్నేళ్లుగా సినిమాలను పైరసీ చేస్తూ ఇబ్బంది పెడుతున్న రవిని ఎట్టకేలకు పట్టుకున్నారు.

Ibomma Immandi Ravi Father's Emotional Comments

Emandi Ravi: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా సినిమాలను పైరసీ చేస్తూ ఇబ్బంది పెడుతున్న రవిని ఎట్టకేలకు పట్టుకున్నారు. దీంతో, సినిమా ఇండస్ట్రీ ఆనందం వ్యక్తం చేసింది. సీపీ సజ్జనార్ సైతం మీడియాతో మాట్లాడుతూ రవి(Emandi Ravi) గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. అయితే, కేవలం సినిమా పైరసీ మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కూడా చేశాడట రవి. దీంతో అతనికి కఠినమైన శిక్ష పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Ntr: ఆఫ్రికా వెళ్తున్న ఎన్టీఆర్.. ఇక నుంచి అక్కడే.. కారణం ఏంటంటే..

ఈ వ్యవహారంపై రవి తండి అప్పారావు స్పందించారు. తన కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్నాం కానీ, ఇలాంటి పని చేస్తున్నాడని తమకు తెలియదని చెప్పాడు. తప్పు ఎవరు చేసిన తప్పే కాబట్టి శిక్ష వేయడం సబబే అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా మరో వీడియో విడుదల చేశాడు అప్పారావు. ఈ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా. “సజ్జనార్‌ సార్‌.. దయచేసి స్టేషన్‌లో మావాడిని ఇబ్బంది పెట్టకండి. మీ బాధ్యతలను కాదని వాడిని విడిచిపెట్టమని నేను అడగడం లేదు.

వాడికి ఒక కూతురు ఉంది. తన గురించి తలుకుంటే ఏడుపు వస్తుంది. కనీసం ఆ బిడ్డ గురించి ఆలోచించి వాడికి తక్కువ శిక్ష పడేలా చేయండి. నా కోడలు నాతో మాట్లాడదు. మా కన్నీళ్లు చూసి సజ్జనార్‌ సార్‌కు జాలీ కలగొచ్చు కానీ, ఆయనది కూడా నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తుంది. మా బాధను చూసి కనీసం కొంచెం తక్కువ శిక్షపడేలా చూస్తే చాలు” అంటూ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పారావు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రవి తండ్రి ఎమోషనల్ రిక్వెస్ట్ పై సజ్జనార్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.