Ilaiyaraaja : సంగీత ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ కాన్సర్ట్..
తారలు మారిన ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారు ఉండరు. ఆయన సంగీతం వింటుంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళ మనుసు కూడా పులకరించాల్సిందే. కాగా సంగీత ప్రియులకు గుడ్ న్యూస్..
- gum 95921
- Published On : February 23, 2023 / 05:39 PM IST
ilayaraja
Ilaiyaraaja : తారలు మారిన ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారు ఉండరు. ఆయన సంగీతం వింటుంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళ మనుసు కూడా పులకరించాల్సిందే. ముఖ్యంగా ప్రేమపక్షులు ఇళయరాజా సంగీతం అంటే ప్రాణం ఇస్తారు. సినీ పరిశ్రమకి వచ్చి 45 ఏళ్ళు అవుతున్నా ఇంకా సంగీత దర్శకుడిగా తన సేవలు అందిస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో కమల్ హాసన్ మూవీకి, తెలుగులో రంగమార్తాండ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.
Chiranjeevi : ఇండియన్ సినిమా గర్వించదగిన క్షణం.. చరణ్ పై చిరు ఎమోషనల్ ట్వీట్!
ఆయన తన కెరీర్‌లో సంగీత దర్శకునిగా 8500కు పైగా పాటలకు స్వరాలను అందించారు.తొమ్మిది భాషలలో దాదాపు 1500కు పైగా చిత్రాలకు ఆయన స్వరరచన చేశారు. ఐదు దశాబ్దాల తన కెరీర్‌లో 20వేలకు పైగా లైవ్ కాన్సర్ట్స్ లు ఇచ్చారు. అంతేకాదు, ఆసియాలో ఆయన మొట్టమొదటి సింఫనీ రచయితగా కూడా ఖ్యాతిగడించారు. పలు అవార్డులు, గౌరవాలను అందుకున్న ఇళయరాజా ఎంతోమంది సంగీత దర్శకులకూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
Ram Charan : అమెరికా వెళ్లేముందు మాలలో రామ్‌చరణ్.. వెళ్ళాక మాల ఏమైంది.. క్లారిటీ!
కాగా సంగీత ప్రియులకు గుడ్ న్యూస్.. ఇళయరాజ పాటలను లైవ్ లో అనుభవించే అవకాశం ఫిబ్రవరి 26న కలగబోతుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఆదివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ ఇవ్వబోతున్నాడు. ఈ షోను హైదరాబాద్ టాకీస్ అండ్ మెర్క్యురీ నిర్వహిస్తోంది. ఈ కాన్సర్ట్ టిక్కెట్ ధరలు 799 రూపాయల నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఈ టిక్కెట్లు పేటీఎం ఇన్‌సైడర్ వద్ద అందుబాటులో ఉంటాయి. మరి ఇళయరాజా సంగీతాన్ని లైవ్ లో ఆస్వాదించాలి అనుకుంటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి.
Maestro Ilayaraja’s live concert in Hyd on Feb 26 #Ilayarajaconcert #Hyd #Feb26 https://t.co/pgulxFPPjb
— NewsMeter (@NewsMeter_In) February 3, 2023
