Ileana DCruz shares his 9th month pregnancy photo
Ileana D’Cruz : దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ వెంటనే పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్టు అందుకొని రెండు సినిమాలతోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయింది. దీంతో చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం అందుకుంది. కానీ సరైన సినిమాలు ఎంచుకోలేక కెరీర్ డల్ అయ్యింది. బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ చక్రం తిప్పుదాం అనుకున్న అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఆల్బమ్ సాంగ్స్ లో కనిపిస్తుంది.
Salaar : కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సలార్ 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్..?
ఇది ఇలా ఉంటే, ఇటీవల ఈ భామ సడన్ గా తన ప్రెగ్నన్సీని అనౌన్స్ చేసి అందర్నీ షాక్ కి గురి చేసింది. అంతేకాదు బేబీ బంప్ తో ఉన్న పిక్ ని కూడా షేర్ చేసింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ అసలు ఇలియానాకు పెళ్లి ఎప్పుడు అయ్యిందని, ఆమె బిడ్డకి తండ్రి ఎవరు అంటూ నెట్టింట తెగ ప్రశ్నలు వేసేశారు. అయితే ఇలియానా మాత్రం వీటిపై ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. ఇటీవల తన ప్రియుడు ఫోటోని షేర్ చేసినప్పటికీ ముఖం కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఫోటో షేర్ చేసింది.
Ram Charan : RC16 గురించి వైరల్ అవుతున్న వార్తలు.. విజయ్ సేతుపతి..!
ఇక తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇలియానాకు తొమ్మిదో నెల గర్భం. మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇంతకీ ఇలియానా ఏమి పోస్ట్ చేసిందంటే.. “తొమ్మిదో నెల గర్భం వల్ల ఏ పని చేయలేకపోతున్న, చాలా అలసటగా ఉంది” అంటూ పోస్ట్ పెట్టింది.
Ileana DCruz shares his 9th month pregnancy photo