Prem Rakshith: మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ఫిదా.. ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌కు గ్లోబల్ సెల్యూట్
మైఖేల్ జాక్సన్ సాంగ్స్ కి కొరియోగ్రాఫీ చేసిన విన్సెంట్ ప్యాటర్సన్ ప్రేమ్ రక్షిత్ (Prem Rakshith)పై ప్రశంసలు కురిపించాడు.
- V Santhosh Kumar
- Published On : March 13, 2026 / 07:20 AM IST
International Dance Choreographer Vincent Paterson Praises Prem Rakshith
- ప్రేమ్ రక్షిత్ డాన్స్ కి మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ఫిదా
- నిన్ను కలవాలని ఉందంటూ వీడియో విడుదల
- ఎమోషనల్ కామెంట్స్ చేసిన ప్రేమ్ రక్షిత్
Prem Rakshith: భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ కొరియోగ్రాఫర్, ఆస్కార్ విజేత ప్రేమ్ రక్షిత్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ మెచ్చిన కొరియోగ్రాఫర్, లెజెండరీ విన్సెంట్ ప్యాటర్సన్ నుండి ప్రశంసలు అందుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి లెజెండరీ స్టార్లకు ఐకానిక్ స్టెప్స్ కంపోజ్ చేసిన ప్రముఖ అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్, ప్రేమ్ రక్షిత్(Prem Rakshith) ప్రతిభను కొనియాడుతూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు.
ఆ వీడియోలో విన్సెంట్ ప్యాటర్సన్ మాట్లాడుతూ.. “హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. నేను చాలా ఏళ్ల పాటు మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేశాను. మీ కొరియోగ్రఫీ నిజంగా అద్భుతం. మీరు ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’లో సభ్యుడిగా ఉండటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇండియాలో మీలాంటి యంగ్ కొరియోగ్రాఫర్లు తమ కలలను నిజం చేసుకుంటున్నారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను రక్షిత్” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆ వీడియో ఇంటర్నేషనల్ వైడ్ వైరల్ గా మారింది.
Kayadu Lohar: ట్రెడిషనల్ లుక్ లో కాయదు హొయలు.. క్యూట్ ఫొటోలు వైరల్
ఇక విన్సెంట్ ప్యాటర్సన్ కామెంట్స్ పై స్పందిస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు ప్రేమ్ రక్షిత్. “నేను చిన్నప్పటి నుండి ‘స్మూత్ క్రిమినల్’ పాటకు, మైఖేల్ జాక్సన్ డాన్స్‌కు పెద్ద అభిమానిని. అలాంటి లెజెండరీ స్టార్‌తో పనిచేసిన వ్యక్తి నుండి అభినందనలు అందుకోవడం ఒక కొరియోగ్రాఫర్‌గా నాకు దక్కిన అత్యున్నత గౌరవం. థాంక్యూ విన్సెంట్ సార్” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసాడు.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ సాధించి, ప్రపంచాన్ని తన గురించి మాట్లాడుకునే చేశాడు ప్రేమ్ రక్షిత్. ఒక సాధారణ కొరియోగ్రాఫర్ స్థాయి నుండి హాలీవుడ్ లెజెండ్స్ ప్రశంసించే స్థాయికి ఎదగడం భారతీయ సినిమా గర్వించదగ్గ విషయం. ఈ విషయంపై నెటిజన్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
