ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలు ప్రతి సంవత్సరం గోవాలో ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా ఈసారి 50వ IFFI వేడుకలు నవంబర్ 20 నుంచి 28వరకు ఘనంగా జరగనున్నాయి.
అయితే IFFI-2019 వేడుకల్లో రజనీకాంత్ ను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. అంతేకాదు విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది.
ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ట్విటర్ ద్వారా శనివారం (నవంబర్ 2, 2019)న ప్రకటించారు. రజనీకాంత్ ఈ అవార్డును ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ఇసాబెల్లెకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం కూడా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా రజినీకాంత్ స్పందిస్తూ.. ఈ ప్రతిష్టాత్మక గౌరవం అందించినందుకు రజనీకాంత్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిజేశారు.
In recognition of his outstanding contribution to Indian cinema, during the past several decades, I am happy to announce that the award for the ICON OF GOLDEN JUBILEE OF #IFFI2019 is being conferred on cine star Shri S Rajnikant.
IFFIGoa50 pic.twitter.com/oqjTGvcrvE— Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019