Jailar 2 : కాంట్రవర్సీ టెన్షన్.. జైలర్-2పై పొలిటికల్ ఎఫెక్ట్.!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్-2పై (Jailar 2) ఆసక్తికరమైన గాసిప్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- September 7, 2026 / 01:18 PM IST
Is Jailer 2 being changed to avoid political controversy
Jailar 2 : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్-2పై ఆసక్తికరమైన గాసిప్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 2026 అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు టాక్.
తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా కొన్ని సన్నివేశాలను తొలగించి, అవసరమైన చోట కొత్తగా సన్నివేశాలను చిత్రీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జైలర్-2లో అసలు ఏ సన్నివేశాలను తొలగించారు.? ఏ సీన్లను రీ-షూట్ చేశారు.? వాటి వెనుక ఉన్న కారణం ఏంటన్నది మాత్రం పూర్తిగా సీక్రెట్‌గా ఉంచుతున్నారట.
జైలర్-2లో పొలిటికల్ అంశాలు ఉన్నాయా లేవా దానిపై కూడా క్లారిటీ లేదు. రజనీకాంత్ ఇమేజ్, తమిళనాడు రాజకీయాలపై ఉన్న ఆసక్తి నేపథ్యంలో చిన్న సన్నివేశం కూడా పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉండటంతోనే నెల్సన్ ఈ మార్పులు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు మాత్రమే.. మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
Raashii Khanna : బ్లాక్ డ్రెస్‌లో రాఖి ఖన్నా మెరుపులు.. క్యూట్ ఫోటోలు..
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ జైలర్ మూవీకి ఇది సీక్వెల్. రజనీకాంత్, రమ్యకృష్ణన్ మళ్లీ భార్యాభర్తలుగా కనిపించనుండగా, యోగి బాబు, మీర్నా, రిత్విక్ తమ పాత్రలలో కొనసాగుతున్నారు. జైలర్‌లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌లతో పాటు, ఈసారి ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.
ఈసారి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. కాస్ట్ అండ్ క్రూ విషయంలో హైప్ కంటిన్యూ అవుతుంటే..పొలిటికల్ సీన్లపై వస్తున్న లీకులు మరింత ఎగ్జైట్‌మెంట్‌ను పెంచేస్తున్నాయి.
