×
Ad

Jabardasth Abhi : ప్రభాస్ పక్కన నటిస్తే.. 11 వేలు ఇచ్చారు.. జబర్దస్త్ అభి కామెంట్స్ వైరల్..

తాజాగా జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న అభి ప్రభాస్ పక్కన నటిస్తే పదకొండు వేలు ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు.(Jabardasth Abhi)

  • Published On : December 15, 2025 / 08:27 PM IST

Jabardasth Abhi

Jabardasth Abhi : ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన రెమ్యునరేషన్ వంద కోట్ల పైనే. ఇక ఆయన పక్కన నటించే వాళ్లకు కూడా భారీగానే ఉంటుంది ఇప్పుడు. అయితే తాజాగా జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న అభి ప్రభాస్ పక్కన నటిస్తే పదకొండు వేలు ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు.(Jabardasth Abhi)

డ్యాన్స్ తో కెరీర్ మొదలుపెట్టిన అభి ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసాడు. మధ్యలో సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటూ దర్శకత్వ శాఖలో కూడా పనిచేసాడు. జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఫేమ్ తెచ్చుకొని కమెడియన్ గా పలు సినిమాలో నటించాడు. ఇప్పుడు దర్శకుడిగా, హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.

Also Read : Akhanda 2 : అఖండ 2 నిర్మాతలను బాలయ్య దూరం పెట్టారా..? నిర్మాతలు వర్సెస్ బాలయ్య..?

ఇటీవలే అభి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా చిరంజీవ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అభి ఈ విషయం తెలిపాడు.

అభి ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా ప్రభాస్ ఈశ్వర్. 2002 లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో అభి ప్రభాస్ పక్కన ఫుల్ సినిమా అంతా ఉంటాడు. ఈ సినిమాకు గాను నిర్మాత అశోక్ కుమార్ అభి కి పదకొండు వేల రూపాయల చెక్ ఇచ్చారట. అలా సినీ పరిశ్రమలో తన మొదటి సంపాదన, అది కూడా ప్రభాస్ సినిమాకు పదకొండు వేలు అని తెలిపాడు. అయితే అంతకంటే ముందే 1997 లో డ్యాన్స్ నేర్పిస్తూ మొదట 50 రూపాయలు సంపాదించానని తెలిపాడు అభి.

Also See : Sobhita Dhulipala : నడుమందాలు చూపిస్తూ శోభిత సోయగాలు..