Jabardasth Babu : దర్శకుడిగా మారిన మరో జబర్దస్త్ కమెడియన్.. వెబ్ సిరీస్‌తో..

జబర్దస్త్ నుంచి తాజాగా మరో రచయిత, కమెడియన్ బాబు దర్శకుడిగా మారాడు. (Jabardasth Babu)

  • Published on- October 10, 2026 / 08:42 PM IST

Jabardasth Babu

Jabardasth Babu : జబర్దస్త్ నుంచి ఇప్పటికే పలువురు కమెడియన్స్, రచయితలు సినీ పరిశ్రమలోకి వచ్చారు. అందులో పలువురు దర్శకులుగా కూడా మారారు. వేణు బలగం సినిమాతో హిట్ కొట్టాడు. ధనరాజ్ రామం రాఘవం అనే ఓ మంచి సినిమా తీసాడు. అదిరే అభి కర్మాఖ్య అనే థ్రిల్లర్ సినిమాతో ఆశ్చర్యపరిచాడు. త్వరలో రామ్ ప్రసాద్, రచ్చ రవి, కిరాక్ ఆర్పీ కూడా దర్శకులు అవుతారని వినిపిస్తుంది.

అయితే జబర్దస్త్ నుంచి తాజాగా మరో రచయిత, కమెడియన్ బాబు దర్శకుడిగా మారాడు. రైటర్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాబు ఆ తర్వాత పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు షోలకు రచయితగా వందల ఎపిసోడ్స్ కి పనిచేసాడు. కమెడియన్ గా కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలలో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు బాబు దర్శకుడిగా మారాడు. ఈటీవీ విన్ లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ తో దర్శకుడిగా మారాడు బాబు.

Also See : Kushitha Kallapu : ఫ్యామిలీతో కలిసి పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్న నటి కుషిత కళ్లపు.. ఫొటోలు..

ఇటీవలే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. వైవా హర్ష, జీవన్ కుమార్, హైపర్ ఆది, ఐశ్వర్య హోలక్కల్ ముఖ్య పాత్రల్లో సాఫ్ట్వేర్ కంపెనీ, బ్యాచిలర్స్ బ్యాక్ డ్రాప్ తో కామెడీ, ఎమోషనల్ కథాంశంతో ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ కి పాజిటివ్ గానే రెస్పాన్స్ వస్తుంది. త్వరలో సినిమా కూడా డైరెక్ట్ చేస్తానంటున్నాడు బాబు.