Satya Sri : లవ్ అని నా వెనక తిరిగితే అతన్ని మా బాబాయ్ వాళ్ళు కొట్టించారు.. జబర్దస్త్ సత్యశ్రీ లవ్ స్టోరీ..
ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యశ్రీ తన లవ్ స్టోరీ గురించి చెప్పింది.

Jabardasth Fame Satya Sri Love Story He was beaten by her father
Satya Sri : నటి సత్యశ్రీ జబర్దస్త్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది. సత్యశ్రీ తల్లి కూడా గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసింది. ఆమె ప్రోత్సాహంతోనే సత్యశ్రీ కూడా సినీ పరిశ్రమకు వచ్చింది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫొటోలు షేర్ చేస్తూ తన గురించి అప్డేట్స్ పెడుతూ ఉంటుంది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యశ్రీ తన లవ్ స్టోరీ గురించి చెప్పింది. తను ఎవర్ని లవ్ చేయలేదు కానీ తనని లవ్ చేస్తే ఏమైందో అని ఆసక్తికర విషయం తెలిపింది.
సత్యశ్రీ మాట్లాడుతూ.. నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఎవరికీ ఎస్ చెప్పలేదు. ఎవరూ దగ్గరికి వచ్చి చెప్పలేదు. దూరం నుంచే హింట్స్ ఇస్తారు. మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు వాళ్ళు ట్రై చేస్తున్నారని. మా ఫ్యామిలీ గురించి తెలిసి నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. మా ఇంట్లో లవ్ ఒప్పుకోరు. ఒకతను వచ్చి ధైర్యం చేసి నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు, ప్రపోజ్ చేసాడు. నేను నో చెప్పినా కూడా అతను మళ్ళీ మళ్ళీ అడిగేవాడు. ఒకరోజు మా నాన్న చూసారు అతను నాతో మాట్లాడటం. తర్వాత రోజు అతను కట్లతో కనిపించాడు. నేను షాక్ అయి అడిగాను ఏమైంది అని. మా బాబాయ్, నాన్న వాళ్ళు కొట్టించారు. మా నాన్నని వెళ్లి నేను అడిగితే అవును కొట్టించాను అయితే ఏంటి అని అన్నారు. దాంతో వామ్మో అనుకున్నా. ఆ తర్వాత ఎవ్వరూ నా జోలికి రాలేదు అని తెలిపింది.
Also Read : Ram Charan : రామ్ చరణ్ సంక్రాంతి ‘గేమ్ ఛేంజర్’తో అయిపోయింది.. నెక్స్ట్ దసరా టార్గెట్?
దీంతో సత్య శ్రీ లవ్ మ్యారేజ్ చేసుకోదని, ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటుందని తెలుస్తుంది. ఇటీవలే ఈ భామ కొత్త ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం కూడా చేసింది.