Ram Charan : రామ్ చరణ్ సంక్రాంతి ‘గేమ్ ఛేంజర్’తో అయిపోయింది.. నెక్స్ట్ దసరా టార్గెట్?
RC16 సినిమాను మొదట 2026 ఎండింగ్ లేదా 2027 ఫస్ట్ హాఫ్ రిలీజ్ చేయాలని అనుకున్నారు.

Ram Charan
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నిన్న జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. మొదట్లో మిక్స్‌డ్ టాక్ వినిపించినా సంక్రాంతి హాలీడేస్ కావడంతో జనాలు బాగానే వెళ్తున్నారు. మొదటి రోజు 186 కోట్లు వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ ఫలితంతో సంబంధం లేకుండా నెక్స్ట్ ప్రాజెక్టు బిజీలో పడిపోయాడు రామ్‌చరణ్.
బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు చరణ్. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా మైసూర్ లో పూర్తి చేశారు. RC16 గా వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో వస్తుందని తెలుస్తోంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఏకంగా గ్లోబల్ స్టార్‌తోనే సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా కాస్టింగ్ అండ్ టెక్నిషియన్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. మ్యూజిక్‌కు రెహమాన్‌ను తీసుకున్న బుచ్చిబాబు చరణ్ సరసన జాన్వీ కపూర్‌ను ఫిక్స్ చేశాడు.
Also See : ‘తండేల్’ నుంచి నాగచైతన్య, సాయి పల్లవి ‘బుజ్జితల్లి..’ వీడియో సాంగ్ వచ్చేసింది..
RC16 సినిమాను మొదట 2026 ఎండింగ్ లేదా 2027 ఫస్ట్ హాఫ్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే గేమ్ ఛేంజర్ కోసం రామ్‌చరణ్ దాదాపు రెండేళ్ల టైమ్ కేటాయించాల్సి వచ్చింది. దీంతో మరో సినిమా చేయడానికి వీలు లేకుండా పోయింది. అందుకే తక్కువ గ్యాప్‌లో నెక్స్ట్ మూవీని కంప్లీట్ చేయాలనుకుంటున్నారట చెర్రీ. ఫ్యాన్స్ కోసం మరోసారి హార్డ్ వర్క్ చేయబోతున్నాడట.
నాన్ స్టాప్‌గా సినిమా షూటింగ్ చేసి ఎట్టి పరిస్థితిలో RC16 సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నాడని టాలీవుడ్ టాక్. గేమ్‌ఛేంజర్ మూవీ నుంచి బయటకు వచ్చి నెక్ట్స్ మూవీని ఫాస్ట్‌గా ఫ్యాన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట చరణ్. తన ఒక్కో సినిమాకు కనీసం రెండేళ్లు పడుతుండటంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారని, ఇక నుంచి సంవత్సరానికి రెండు లేదా ఒక సినిమా అయినా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడట రామ్‌చరణ్.
Also Read : Ram Charan – TN Seshan : ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ పాత్ర.. రియల్ లైఫ్ లో ఆ ఆఫీసర్ లైఫ్ స్టోరీనా?
మరి RC16 షూటింగ్ ఫాస్ట్ గా పూర్తిచేసి దసరాకు నిజంగానే రిలీజ్ చేస్తారా చూడాలి. ఆ సినిమా తర్వాత సుకుమార్ తో RC17 సినిమా ఉంది. ప్రస్తుతం సంక్రాంతికి గేమ్ ఛేంజర్ థియేటర్స్ లో సందడి చేస్తుంది. సంక్రాంతి పండగ అవ్వగానే చరణ్ RC16 సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం.