Ram Charan – TN Seshan : ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ పాత్ర.. రియల్ లైఫ్ లో ఆ ఆఫీసర్ లైఫ్ స్టోరీనా?
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ IPS నుంచి IAS గా మారి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ పాత్రలో కూడా కనిపిస్తాడు.

Ram Charan Character in Game Changer Inspired form Ex Chief Election Commissioner of India TN Seshan
Ram Charan – TN Seshan : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా నిన్న జనవరి 10న థియేటర్స్ లో రిలీజయింది. మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా గేమ్ ఛేంజర్ సినిమాపై ఎక్కడలేని నెగిటివిటీని చూపిస్తున్నారు. కానీ సంక్రాంతి హాలీడేస్ ఉండటంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ సినిమా 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ IPS నుంచి IAS గా మారి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ పాత్రలో కూడా కనిపిస్తాడు. ఆ పాత్రలో హీరో – విలన్ మధ్య సన్నివేశాలు ఎత్తుకు పైఎత్తు అన్నట్టు ఆసక్తికరంగా సాగుతాయి. ఆ పాత్రలో చరణ్ లుక్స్ కూడా బాగున్నాయి. అయితే ఈ పాత్ర రియల్ లైఫ్ లో మాజీ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా TN శేషన్ పాత్ర నుంచి తీసుకున్నారని సమాచారం.
తమిళనాడు ఐఏఎస్ క్యాడర్ కి చెందిన TN శేషన్ ఒక అసిస్టెంట్ కలెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత కలెక్టర్ గా, పలు ప్రభుత్వ విభాగాలకు కమిషనర్ ఆఫీసర్ గా, సెంట్రల్ గవర్నమెంట్ లో క్యాబినెట్ సెక్రటరీగా పనిచేస్తూ 1990లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు. ఈ సమయంలో ఆయన ఎన్నికల సంఘంలో అనేక మార్పులను తీసుకొచ్చారు. ఎలాంటి రాజకీయ నాయకులు అయినా తప్పు ఉంటే వదల్లేదు. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పలు నాయకులు, మరికొన్ని కారణాలతో చాలా మంది నామినేషన్లు తిరస్కరించారు. అవినీతి అధికారులకు చుక్కలు చూపించారు. ఒక డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు TN శేషన్.
ఆయన జీవిత కథ ఆధారంగానే కార్తీక్ సుబ్బరాజు గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ పాత్రను రాసుకున్నాడని తెలుస్తుంది. ఇందులో కూడా చరణ్ పాత్ర ఎలక్షన్ కమిషనర్ గా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతూ ఓట్ల గొప్పతనం గురించి చాటిచెప్తుంది. దీంతో చరణ్ పాత్ర TN శేషన్ గారి పాత్ర ఆధారంగా రాసుకొని చుట్టూ కథని అల్లుకున్నారని సమాచారం.
Also See : మాధవన్ ‘హిసాబ్ బరాబర్’ ట్రైలర్ రిలీజ్.. బ్యాంక్ వర్సెస్ రైల్వే టీసీ..
TN శేషన్ ఎలక్షన్ కమిషనర్ గా పదవీకాలం అయ్యాక రాజకీయాల్లోకి కూడా వచ్చారు. 2019లో ఆయన మరణించారు. తమిళనాడులో ఆయన గురించి డైనమిక్ ఆఫీసర్ గా గొప్పగా చెప్పుకుంటారు.