Director Bobby : షూటింగ్ లో ఎవరి మాట వినని గుర్రం.. బాలయ్యకి చెప్తే.. ‘డాకు మహారాజ్’ పై డైరెక్టర్ బాబీ కామెంట్స్..

డైరెక్టర్ బాబీ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Director Bobby : షూటింగ్ లో ఎవరి మాట వినని గుర్రం.. బాలయ్యకి చెప్తే.. ‘డాకు మహారాజ్’ పై డైరెక్టర్ బాబీ కామెంట్స్..

Director Bobby Interesting Comments on Balakrishna and Daaku Maharaaj

Updated On : January 11, 2025 / 4:49 PM IST

Director Bobby : శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించగా బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బాబీ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

డైరెక్టర్ బాబీ డాకు మహారాజ్ సినిమా గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారి ఇమేజ్, ఆయన ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకొనే ఈ సినిమాను చేసాం. కానీ బాలకృష్ణ గారి గత సినిమాలకు భిన్నంగా బాలయ్య గారి పాత్ర ఉంటుంది. నరసింహానాయుడు, సమరసింహారెడ్డి.. ఇలా చాలా సినిమాల్లో బాలయ్య గారు అంటే పవర్ ఫుల్ డైలాగ్స్, సౌండ్ తో ఉంటాయి సినిమాలు. కానీ సింహా లాంటి సినిమాలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కూడా చేసి మెప్పించారు. ఈ డాకు మహారాజ్ సినిమాలో కూడా అలాంటి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని తెలిపారు.

Also See : Allu Arjun: అల్లు అర్జున్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా? బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో మీటింగ్ దానికోసమేనా..?

బాలకృష్ణ గారి గురించి చెప్తూ.. బాలకృష్ణ గారి దగ్గర్నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. డైరెక్టర్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలకృష్ణ గారు అంత గౌరవిస్తారు. బాలయ్య గారు డూప్ లేకుండానే నటిస్తారు ఫ్యాన్స్ కోసం. షాట్ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినా కారవాన్ లోకి వెళ్లకుండా అక్కడే సెట్స్ లో కూర్చుంటారు. ఇందులో హార్స్ రైడింగ్ సీన్స్ ఉన్నాయి. బాలయ్య గారి కోసం కింద పడేయని ఒక హార్స్ ని తీసుకురమ్మన్నాం. షూటింగ్ జైపూర్ లో జరుగుతుంది. గుర్రం హైదరాబాద్ నుంచి రావాలి. పలు కారణాలతో లేట్ అవ్వడంతో అక్కడే ఒక గుర్రాన్ని తెచ్చాం. కానీ అది వాళ్ళ ఓనర్ మాట కూడా వినట్లేదు. రెండు సార్లు వాళ్ళ ఓనర్ నే పడేసింది. బాలయ్య గారికి గుర్రం గురించి చెప్తే నేను చూసుకుంటాను అని ఆ గుర్రం ఎక్కి దాన్ని కంట్రోల్ లోకి తెచ్చి స్వారీ చేశారు అని తెలిపారు.

ట్రైలర్ లో విజువల్స్ కు ఎక్కువ పేరు రావడం గురించి స్పందిస్తూ.. నిర్మాత నాగవంశీ గారు బాలకృష్ణ ఫ్యాన్. తన బ్యానర్ లో బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు స్పెషల్ గా ఉండాలి అనుకున్నాం. అందుకే ఇద్దరం కలిసి సినిమాలో విజువల్స్ గురించి మాట్లాడేలా చేయాలనుకున్నాం. డీఓపీ విజయ్ కన్నన్ తో గతంలో ఓ రెండు మూడు సార్లు మాట్లాడాను. ఆయన జైలర్ సినిమాకి పని చేస్తున్న సమయంలో ఈ సినిమా గురించి చెప్పి ఒప్పించాం. సినిమాకు ముందు కూడా కథలో మాతో పాటే ట్రావెల్ చేసారు ఆయన. అందుకే విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి అని తెలిపారు డైరెక్టర్ బేబీ.

Also Read : Ramayana: The Legend Of Prince Rama : జపాన్ ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

ఈ సినిమాలో బాలయ్య పట్టుకున్న తుపాకీ గొడ్డలి ఆయుధం గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో హీరోకి ఆయుధం చాలా ముఖ్యం. బాలకృష్ణ గారి సినిమాల్లో గొడ్డలి బాగా ఫేమస్. కానీ గొడ్డలితో పాటు ఏదైనా కొత్తగా ఉండాలి అనుకోని మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారికి చెప్తే ఈ తుపాకీ గొడ్డలి డిజైన్ చేసారు. అలాగే సినిమాలో చాలా కొత్తగా ఆయుధాలు చాలా ఫాస్ట్ గా డిజైన్ చేసిచ్చారు అని చెప్పారు.

అలాగే.. రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ సమయంలో దర్శకుడు, నటీనటుల కంటే కూడా సిబ్బంది బాగా కష్టపడ్డారు. మేము షూట్ గ్యాప్ లో నీడలోకి వెళ్ళిపోతాము. కానీ మూవీ యూనిట్ విరామమే లేకుండా ఎండలో ఎంతో కష్టపడతారు. వారి కష్టం ముందు మా కష్టం చాలా చిన్నది అని తెలిపారు బాబీ.

బాబీ చిరంజీవి వాల్తేరు వీరయ్య తర్వాత బాలకృష్ణతో డాకు మహారాజ్ చేసారు. దీంతో ఈ ఇద్దరి గురించి చెప్తూ.. సినిమా విషయంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరిలో ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. ఇద్దరూ పని రాక్షసులే. నిర్మాతలకు నష్టం రాకూడదు అనే ఆలోచనతో ఉంటారు. సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. వారి అనుభవంతో సూచనలు కూడా ఇస్తారు, సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ గారెలతో పనిచేసే ఛాన్స్ రావడం నా అదృష్టం అని అన్నారు.