×
Ad

Ram Prasad : 9 ఏళ్ళు కలిసి ట్రావెల్ చేసి వెళ్లిపోయారు.. సుధీర్, గెటప్ శ్రీను కోసం రామ్ ప్రసాద్ ఎమోషనల్..

గతంలో జబర్దస్త్ షోలో వీళ్ళిద్దరూ వెళ్లిపోయారని ఎమోషనల్ అయ్యాడు రామ్ ప్రసాద్. (Ram Prasad)

  • Published On : February 22, 2026 / 05:11 PM IST

Ram Prasad

Ram Prasad : జబర్దస్త్ షోతో గెటప్ శ్రీను, సుధీర్, రామ్ ప్రసాద్ ముగ్గురు మంచి ఫేమ్ తెచ్చుకొని స్టార్స్ అయ్యారు. ముగ్గురు ప్రాణమిత్రులు కూడా అయ్యారు ఈ షోతో. చాలా ఏళ్ళు ఈ ముగ్గురు కలిసి కొన్ని వందల స్కిట్స్ తో నవ్వించారు. అయితే సుధీర్ ఇప్పుడు జబర్దస్త్ మానేసి హీరోగా, యాంకర్ గా బిజీగా ఉన్నాడు. ఇక గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ మానేసి సినిమాల్లో కమెడియన్ గా బిజీగా ఉన్నాడు.(Ram Prasad)

రామ్ ప్రసాద్ మాత్రం సినిమాల్లో అడపాదడపా చేస్తున్నా జబర్దస్త్ చేస్తున్నాడు. గతంలో జబర్దస్త్ షోలో వీళ్ళిద్దరూ వెళ్లిపోయారని ఎమోషనల్ అయ్యాడు రామ్ ప్రసాద్. తాజాగా యాంకర్ సుమ చాట్ షోలో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను హాజరవగా రామ్ ప్రసాద్ ఈ ఇద్దర్ని ఎంతలా మిస్ అవుతున్నానో తెలుపుతూ ఎమోషనల్ అయ్యాడు.

Also See : Rana Wife Miheeka : అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో రానా భార్య.. గర్ల్ గ్యాంగ్‌తో షార్ట్ డ్రెస్‌లో మిహీక ఫోటోలు వైరల్..

రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. నా లైఫ్ లో నేను అసలు ఎమోషన్ అవ్వను. ఎమోషన్ అయినా కామెడీ చేస్తాను. వీళ్ళు నాకు ఇంట్లో వాళ్ళలాగా కలిసి పోయారు. స్క్రీన్ మీద కలిసి కనిపించేవాళ్ళు. ఒక్కసారిగా వెళ్లిపోయారు. వీళ్ళతో ట్రావెల్ ఆగిపోయేసరికి ఫస్ట్ రోజు చాలా ఎమోషనల్ అయ్యాను. ఒకరోజు ఆపుకోలేక షోలో ఏడ్చేసాను. ఆల్మోస్ట్ మేం ముగ్గురం 9 ఏళ్ళ 8 నెలలు కలిసి ట్రావెల్ చేసాము. రోజూ కలిసేవాళ్ళం. ఒకే కార్ లో తిరిగేవాళ్ళం. అంతలా తిరిగి ఒక్కడినే అయిపోయాను.

సోలో ఫీలింగ్ వచ్చేసింది. ఒక్కడినే అయిపోయాను అని ఫీలింగ్ వచ్చి ఎమోషనల్ అయ్యాను. ముగ్గురు కలిసి స్కిట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఇప్పుడు నేను వేరే వాళ్లకు చెప్తున్నాను. ఏంటి ఇలా అయింది అనుకున్నాను. ఒకరోజు రాకేష్ మా ముగ్గురి మీద స్కిట్ చేసాడు. ఆ రోజు నేను షోలో ఏడ్చేసాను. షో అవ్వగానే ఇద్దరికీ ఫోన్ చేసి చాలా మిస్ అయ్యాను, ఏడ్చేసాను షోలో అని చెప్పాను. మళ్ళీ ఫ్యూచర్ లో ముగ్గురం కలిసి ఒక్కసారైనా స్కిట్ చేస్తాము అని అన్నాడు.

Also Read : Naveen : 50 ఏళ్ళ వయసులో నాన్న.. నరేష్ – పవిత్ర బంధంపై స్పందించిన కొడుకు.. ఏమన్నాడంటే..