Ram Prasad Bigg Boss : రామ్ ప్రసాద్ కోసం సుడిగాలి సుధీర్ ఎంట్రీ.. ఇక బిగ్ బాస్ కప్ అతనిదే..?
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను.. ఈ ఇద్దరూ రామ్ ప్రసాద్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. (Jabardasth Ram Prasad Bigg Boss)
Jabardasth Ram Prasad Will Gets Sudigali Sudheer Support For Bigg Boss
Jabardasth Ram Prasad Bigg Boss : బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్లో కంటెస్టెంట్‌గా ఉన్న రామ్ ప్రసాద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అది కాక బయట నుంచి బలమైన సెలబ్రిటీ సపోర్ట్ కూడా ఉంది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను.. ఈ ఇద్దరూ రామ్ ప్రసాద్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. వీళ్ళిద్దరూ బయటకు వచ్చి రామ్ ప్రసాద్ కి సపోర్ట్ చేస్తే వార్ వన్ సైడ్ ఖాయం అంటున్నారు.
తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ ప్రసాద్‌కు ఓట్లు వేయాలని సుధీర్ ఒక వీడియో విడుదల చేసినా, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసినా, అది ఓటింగ్‌పై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. జబర్దస్త్ నుంచి సుధీర్, రామ్ ప్రసాద్ మధ్య మంచి స్నేహం ఉంది. ఎన్నో స్కిట్లలో కలిసి నటించిన ఈ ఇద్దరూ వ్యక్తిగతంగానూ మంచి స్నేహితులు.
Also Read – Mahendragiri Varahi OTT : మహేంద్రగిరి వారాహి మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
అందుకే రామ్ ప్రసాద్‌కు సపోర్ట్‌గా సుధీర్ స్పందిస్తే అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాకపోయినా రామ్ ప్రసాద్ నామినేషన్స్‌లో లేదా ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్న సమయంలో సుధీర్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లేదా చిన్న వీడియో ద్వారా అభిమానులను ఓటింగ్‌కు పిలిచే అవకాశం ఉందట. దీంతో రామ్ ప్రసాద్‌కు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు రామ్ ప్రసాద్ సేఫ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సుధీర్ ఒక్కడే రామ్ ప్రసాద్ కోసం గట్టిగా నిలబడితే బిగ్ బాస్ కప్పు కూడా ఈజీగా గెలిచేయొచ్చు.
మరి బెస్ట్ ఫ్రెండ్ రామ్ ప్రసాద్ కోసం సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను బయటకు వచ్చి బిగ్ బాస్ లో అతనికి ఓటింగ్ వేయమని చెప్తారా చూడాలి. అలాగే రామ్ ప్రసాద్, నరేష్, వర్షిణి కోసం జబర్దస్త్, టీవీ షోల బ్యాచ్ అంతా త్వరలో బయటకు వచ్చి వేళ్ళకు ఓట్లు వేయాలని వీడియోస్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట.
Also Read – Mahendragiri Varahi Review: ‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ.. 200 ఏళ్లుగా వారాహి అమ్మవారి శాపం..
