×
Ad

Jabardasth Varsha : బాబోయ్.. జబర్దస్త్ వర్ష ఈ రేంజ్ లో డ్యాన్స్ వేస్తుందా.. జూనియర్ సమంత అంటూ కామెంట్స్..

వర్ష డ్యాన్స్ చేస్తుందని తెలుసు కానీ మరీ ఇంత మాస్ డ్యాన్స్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.

  • Published On : August 1, 2024 / 07:55 AM IST

Jabardasth Varsha Mass Stylish Dance goes Viral Netizens says she Looks like Samanatha

Jabardasth Varsha : సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకునన్ వర్ష జబర్దస్త్ లోకి వచ్చాక బాగా పాపులర్ అయింది. జబర్దస్త్ స్కిట్స్ తో, ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ, బయట ఈవెంట్స్ తో, తన సోషల్ మీడియా ఫొటోలతో జబర్దస్త్ వర్ష బాగా పాపులర్ అయింది.

వర్ష డ్యాన్స్ చేస్తుందని తెలుసు కానీ మరీ ఇంత మాస్ డ్యాన్స్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే తాజాగా వర్ష డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఓ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లో పలువురు డ్యాన్సర్లతో కలిసి అదిరిపోయే మాస్ డ్యాన్స్ వేసింది. నాగార్జున సూపర్ సినిమాలోని ముద్దులెట్టి చెరిపేయ్.. మాస్ సాంగ్ కి వర్ష అదిరిపోయే స్టెప్పులు వేసింది.

Also Read : Ram Charan – Niharika : చరణ్ అన్న వరల్డ్ లోనే బెస్ట్ ఫాదర్.. చరణ్, క్లిన్ కారాపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు..

బ్లాక్ డ్రెస్ లో కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తూ మాస్ స్టెప్స్ వేయడంతో వర్ష ఈ రేంజ్ లో డ్యాన్స్ వేస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ లుక్స్ లో వర్ష అక్కడక్కడా సమంతలా కనిపిస్తుండటంతో జూనియర్ సమంత అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మీరు కూడా వర్ష డ్యాన్స్ చూసేయండి..