Jagapathi Babu : ‘సలార్’ సినిమాపై జగపతిబాబు కామెంట్స్.. ప్రభాస్ కాంబినేషన్‌లో ఒక్క సీన్ కూడా లేదంట
సలార్ సినిమాలో జగపతిబాబు రాజమన్నార్ అనే పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే జగపతి బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
- Saketh U
- Published On : July 16, 2023 / 04:17 PM IST
Jagapathi Babu comments on Prabhas Salaar Movie
Jagapathi Babu Salaar : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నుంచి రాబోతున్న సినిమా ‘సలార్’. శ్రుతి హాసన్ హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో భారీ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది సలార్. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా సలార్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఇటీవలే సలార్ సినిమా టీజర్ రిలీజయింది. ఈ టీజర్ కూడా KGF రేంజ్ కంటే మించి ఎలివేషన్స్ తో ఉంది. ప్రభాస్ కి భారీ ఎలివేషన్స్ ఇచ్చారు టీజర్ లో. ఇక సలార్ సినిమా కుడా రెండు పార్టులుగా రాబోతుందని ప్రకటించారు. సలార్ పార్ట్ 1 ceasefire సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు రాజమన్నార్ అనే పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే జగపతి బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
Natasha Doshi : నిశ్చితార్థం చేసుకున్న బాలయ్య సినిమా హీరోయిన్..
తాజాగా జగపతి బాబు సలార్ సినిమా గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. జగపతి బాబు మాట్లాడుతూ.. సలార్ పార్ట్ 1లో నాకు, ప్రభాస్ కి కాంబినేషన్ లో అసలు సీన్స్ లేవు. నేను కొద్దిసేపే కనిపిస్తాను పార్ట్ 1లో. పార్ట్ 2లో మాత్రం మా ఇద్దరి మధ్య మంచి సీన్స్ ఉంటాయి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అని తెలిపారు. ఇక సలార్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
