Jagapathi Babu : అందులో నా సీన్స్ తగ్గించారు.. పుష్ప 3 అప్డేట్ ఇచ్చిన జగపతి బాబు..
తాజాగా జగపతి బాబు పెద్ది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుష్ప సినిమా గురించి మాట్లాడారు. (Jagapathi Babu)
- Saketh U
- Updated on- May 29, 2026 / 04:58 PM IST
Jagapathi Babu
Jagapathi Babu : పుష్ప 2 సినిమా పాన్ ఇండియా వైడ్ ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆల్మోస్ట్ 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ మరింత పెంచుకున్నాడు. అయితే పుష్ప 3 సినిమా కూడా ఉన్నట్టు అధికారికంగానే ప్రకటించారు. కానీ ఆ సినిమా ఎప్పుడు వస్తుందో ఎవరికీ క్లారిటీ లేదు. కానీ ఆ సినిమా ఉంటుందని సుకుమార్, బన్నీ కూడా క్లారిటీ ఇచ్చారు.
పుష్ప 2 సినిమా చివర్లో పుష్ప వీర ప్రతాప్ రెడ్డి(జగపతి బాబు) తమ్ముడు, తమ్ముడు కొడుకును చంపేయడంతో వీర ప్రతాప్ పుష్ప మీద పగతో ఉంటాడు. తాజాగా జగపతి బాబు పెద్ది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుష్ప సినిమా గురించి మాట్లాడారు.
Also Read : Ram Charan : మొన్న గేమ్ ఛేంజర్.. ఇప్పుడు పెద్ది.. పాపం చరణ్ సినిమా అంటే చాలు..
జగపతి బాబు మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో నా సీన్స్ ఇంకా ఉండాలి. కథలో కుదరక, లెంగ్త్ సెట్ అవ్వక నా సీన్స్ తగ్గించారు. పార్ట్ 2 లో నేను కొంతే కనిపించాను. పుష్ప 3 సినిమా ఉంది. నేను పార్ట్ 3 లో కూడా ఉంటాను. పార్ట్ 3లో నా సీన్స్ చాలా ఉంటాయి. పార్ట్ 3లో నేను గుండుతో కనిపిస్తాను అని తెలిపారు.
దీంతో జగపతి బాబు పుష్ప పార్ట్ 3 సినిమా ఉంటుందని మరోసారి కంఫర్మ్ చేసాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ఉన్న మూడు సినిమాలు అయ్యాక పుష్ప 3 సినిమా ఉండొచ్చు అని భావిస్తున్నారు ఫ్యాన్స్.
