Jagapathi Babu: రాయణం పాత్ర నాదే.. మీకు మార్కెట్ లేదని మొహం మీదే చెప్పేశాడు.. ఉప్పెన గురించి షాకింగ్ నిజాలు

ఉప్పెన సినిమాలో రాయణం పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన జగపతి బాబు(Jagapathi Babu).

Jagapathi Babu interesting comments on vijay sethupathi Rayanam character in Uppena movie

  • ‘పెద్ది’లో అప్పలసూరిగా జగపతిబాబు.
  • బుచ్చిబాబు నిజాయితీపై ఆసక్తికర వ్యాఖ్యలు.
  • ‘ఉప్పెన’ రాయణం పాత్రపై కామెంట్స్.

Jagapathi Babu: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. గ్లోబల్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు ‘అప్పలసూరి’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

SatyaDev: హీరోని మార్చెయ్ అన్నారు.. ఆర్జీవీ ఆలా అంటారనుకోలేదు.. సత్యదేవ్ ఎమోషనల్

తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న జగపతిబాబు(Jagapathi Babu) తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సుదీర్ఘ సినీ కెరీర్‌లోనే ‘అప్పలసూరి’ పాత్ర చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. బుచ్చిబాబు పాత్రలను డిజైన్ చేసే విధానం అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు. అయితే ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుకు సంబంధించిన ఒక పాత నిజాన్ని బయటపెడుతూ జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

నిజానికి బుచ్చిబాబు డెబ్యూ మూవీ ‘ఉప్పెన’లోని ఐకానిక్ రాయణం పాత్ర కోసం మొదట జగపతిబాబునే అనుకున్నారట. ఆ కథ చెప్పడానికి బుచ్చిబాబు ఆయన ఇంటి వరకు వచ్చి, ఎందుకో వెనక్కి వెళ్లిపోయాడని తెలిపారు. ఆ తర్వాత ఎందుకు రాలేదని అడగ్గా.. “సార్, మీకంటే విజయ్ సేతుపతికి అక్కడ మార్కెట్ ఎక్కువ ఉంది కదా.. అందుకే ఆయన్ని తీసుకున్నాం” అని బుచ్చిబాబు మొహం మీదే చెప్పాడట. కథ చెప్పకపోయినా, కనీసం నిజాయితీగా ఆ నిజాన్ని ఒప్పుకున్నందుకు బుచ్చిబాబును అభినందిస్తున్నట్లు జగపతిబాబు నవ్వుతూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.